తన దగ్గర చదువుకుంటున్న విద్యార్థినిమీద కన్నేశాడో కీచక టీచర్. ఆమెను కోరిక తీర్చాలని కోరాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో.. ఆమె నెంబర్ సంపాదించి.. అసభ్యకరమైన మెసేజ్ లు, వీడియోలు పంపిస్తూ వేధించడం మొదలుపెట్టాడు.

చెన్నై : పాఠాలు భోదిస్తూ మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రొఫెసర్ పాడుబుద్ధితో విద్యార్థినిపై కన్నేశాడు. తన కోరిక తీర్చాలని బాలికను హింసించేవాడు. చివరికి student వాటిని తట్టుకోలేక ప్రొఫెసర్ పై కళాశాల అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఉదాంతం tamilnaduలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులో కన్యాకుమారి కళాశాలలో ఓ యువతి చదువుతోంది. ఆ కళాశాలలోని ప్రొఫెసర్ గా పని చేస్తున్న వాసుదేవన్ విద్యార్థినిపై కన్నేశాడు. ఎలాగో ఒకలా ఆమె phone number సంపాదించాడు. ఇక ఆ రోజు నుంచి ఆమెను అసభ్యకరమైన smsలు, videoలను పంపుతూ తరచూ వేధించేవాడు. అతని కోరికలని తీర్చాలని సదరు విద్యార్థినిని Physically, mentallyగానూ తీవ్ర ఇబ్బందులు పెట్టేవాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు.. ఆమె తన సోదరుడిని ఈ దారుణాన్ని చెప్పుకుంది.

అనంతరం ఆమె సోదరుడు కళాశాలకు వచ్చి ప్రొఫెసర్ ను నిలదీయడంతో వారు బాధితులపైనే దాడి చేశారు. ఇక చేసేదేమి లేక చివరికి యువతి తన సోదరుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ విషయం బయటకు రావడంతో ప్రొఫెసర్ ను సస్పెండ్ చేయాలని కళాశాలలో నిరసనలు చేపట్టారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే జనవరిలో మైసూరులో చోటు చేసుకుంది. సమాజంలో ఆదర్శంగా ఉండి, మంచి పౌరులను తీర్చి దిద్దాల్సిన teachers వక్రమార్గం పడుతున్నారు. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన students పాలిట కీచకుల్లా మారి నీచంగా ప్రవర్తిస్తున్నారు. బెదిరించి, భయపెట్టి చిన్నారులను లొంగదీసుకుంటూ.. వారిపై అకృత్యాలకు పాల్పడుతూ school పవిత్రతతను దెబ్బతీస్తున్నారు. అలా పవిత్రమైన గురువు వృత్తిలో ఉండి, ఓ విద్యార్థినితో రాసలీలలు సాగిస్తున్న head master నీచ ఉదంతం ఒకటి బయటపడింది. 

ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం Mysore District హెచ్ డీ కోటె తాలూకాలో వెలుగు చూసింది. విద్యార్థినితో రాసలీలలు చేస్తున్న వీడియోలు WhatsAppలో సర్కిల్ కావడంతో ఆ హెచ్ఎం మీద ప్రజలు భగ్గుమంటున్నారు. మైసూరు వ్యాప్తంగా ఆ వీడియోలు viral కావడంతో బాలిక కుటుంబం తలెత్తుకోలేకపోతోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న జిల్లా విద్యాధికారి స్పందించారు. త్వరలోనే పాఠశాలను సందర్శిస్తానని, వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

నిరుడు డిసెంబర్ లో ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ప్రాక్టికల్స్ పరీక్షల పేరిట రాత్రి వేళ పదిహేడు మంది పదవ తరగతి చదువుతున్న బాలికలను పాఠశాలకు పిలిచి, వారికి మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించిన కీచక ఉపాధ్యాయుడి బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో వెలుగుచూసింది. నవంబర్ 17వ తేదీ రాత్రి Muzaffarnagar లో పదవ తరగతి చదువుతున్న 17 మంది బాలికలను ఓ కీచక ఉపాధ్యాయుడు CBSE Practical Examసాకుతో వారిని పాఠశాలకు పిలిచాడు. అక్కడ ఆ కీచకుడు ఆ బాలికలకు మత్తుమందు కలిపిన ఆహారం పెట్టాడు. ఆ తరువాత మత్తులోకి జారుకున్న అమ్మాయిలపై ఉపాధ్యాయుడు Sexually harassment చేశాడు. మత్తులోకి జారుకున్న బాలికలు మరుసటి రోజు తేరుకుని ఇంటికి తిరిగి వచ్చారు. అయితే స్పృహలోకి వచ్చాక తమకు జరిగింది తెలిసినా.. ‘ఏం జరిగిందో ఎవరికీ చెప్పవద్దని.. చెబితే వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని’ నిందితుడైన ఉపాధ్యాయుడు బాలికలను threatening చేశాడు.