చెన్నై:టిక్ టాక్‌లో వీడియోలు పోస్ట్ చేసిన భార్యను అతి దారుణంగా హత్య చేసిన  ఘంటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తమిళనాడులోని కోయంబత్తూరులోని వెలినగర్ ప్రాంతానికి చెందిన కనకరాజ్ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. అతనికి భార్య నందిని, ఓ కూతురు, కొడుకు ఉన్నారు. నందిని సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తోంది. భార్యభర్తల మధ్య గొడవల కారణంగా రెండేళ్లుగా వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.

నందిని ఇటీవల కాలంలో అసభ్యమైన హావభావాలను చూపుతూ పలు వీడియోలను పోస్ట్ చేసింది. దీంతో నందినికి కనకరాజ్ ఫోన్ చేసి టిక్ టాక్‌లో వీడియోలు పోస్ట్ చేయకూడదని కోరాడు. అంతేకాదు తనతో  కాపురం చేసేందుకు రావాలని  కోరాడు. 

అయితే నందిని కనకరాజ్‌తో ఫోన్‌ను  మాట్లాడుతూనే  కట్ చేసింది. ఆ తర్వాత ఆమెకు పలుమార్లు ఫోన్ చేసినా బిజీ బిజీ అని రావడంతో కోపోద్రేనికా గురయ్యాడు.ఆ తర్వాత శుక్రవారం నాడు సాయంత్రం నందిని పనిచేస్తున్న కాలేజీ వద్దకు మద్యం సేవించి వెళ్లి ఆమెతో గొడవపడ్డాడు.  భార్యాభర్తలు గొడవకు దిగారు. 

ఈ క్రమంలోనే కోపాన్ని తట్టుకోలేక కనకరాజ్ తన వెంట తెచ్చుకొని నందినిని పొడిచి పారిపోయాడు. నందిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆమె మృతి చెందింది.  మధుకరై పోలీసులు  ఈ ఘటనపై కేసు నమోదు చేసి  అరెస్ట్ చేశారు.