వందేభారత్ రైలు భోజనంలో బొద్దింక.. రైల్వే శాఖ స్పందన ఏంటంటే..

వందేభారత్ ట్రైన్లో ఓ ప్రయాణికుడికి దారుణమైన అనుభవం ఎదురయ్యింది. నాన్ వెజ్ థాలీలో బొద్దింక వచ్చింది. 

Cockroach in Vandebharat train meal, railway department responds - bsb

వందేభారత్ రైలులో సప్లై చేసిన భోజనంలో ఓ ప్రయాణికుడికి బొద్దింక వచ్చింది. దీంతో షాక్ అయిన ఆ ప్రయాణికుడు ఆ ఫొటోలను తీసి.. వందేభారత్ ట్రైన్ లో తన అనుభవాన్ని షేర్ చేశాడు. ఈ ఘటన ఫిబ్రవరి 1వ తేదీన జరిగింది. ఆ ప్రయాణికుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో రాణి కమలపాటి నుండి జబల్‌పూర్ జంక్షన్‌కు వెళుతున్నాడు. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందించిన ఆ భోజనంలో చనిపోయిన బొద్దింక రావడంతో ఖంగుతిన్నాడు. 

ఈ విషయాన్ని ట్విట్టర్ లో ఫొటోలతో సహా షేర్ చేయడంతో వైరల్ గా మారింది. నెటిజన్లు భారతీయ రైల్వేలో ఆహార నాణ్యతపై అనేక కామెంట్స్ చేశారు. ఇది వైరల్ గా మారడంతో ఈ ట్వీట్ IRCTC దృష్టికి వెళ్లింది. వెంటనే దీనిమీద ఐఆర్సిటీసీ స్పందించింది. 

అవును.. బిస్కెట్ ను కుక్క యజమానికి ఇచ్చాను.. అందులో తప్పేముంది - వైరల్ వీడియోపై రాహుల్ గాంధీ

ఈ పోస్ట్ చేసిన ప్రయాణికుడి పేరు డాక్టర్ శుభేందు కేశరి. ఆయన నాన్ వెజ్ థాలీ ఆర్డర్ చేయగా అందులో బొద్దింక వచ్చింది. దీంతో తాను తీవ్ర ఆందోళనకు గురయ్యానని ఆయన తన పోస్టులో రాశారు. ఈ ఫొటోలతో పాటు తాను ఫిర్యాదుల బుక్ లో ఫుడ్ బాలేదని రాసిన కంప్లైంట్ ను ఫొటోను కూడా షేర్ చేశారు. 

ఈ ఘటనపై IRCTC వెంటనే స్పందించింది. ఇది చాలా బాధ కలిగించే విషయం అని, దీనిక అధికారులు ఆ ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పారు. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై భారీ పెనాల్టీ విధించినట్లు తెలిపారు. దీనిమీద వారు ఎక్స్ లో ట్వీట్ చేస్తూ...‘సర్, మీకు కలిగిన ఇబ్బందికి మా హృదయపూర్వక క్షమాపణలు. విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై భారీ జరిమానా విధించబడింది. అంతేకాకుండా, ఇలాంటివి ఇక ముందు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని IRCTC రాసింది.

రైల్వే సేవా ట్వీట్‌పై కూడా స్పందించింది. రైల్వే సేవ మీద మీరుఫిర్యాదు నమోదు చేసినట్లు చెప్పారు. "మీ ఫిర్యాదు రైల్‌మదాద్‌లో నమోదు చేశాం. ఫిర్యాదు నం. మీ మొబైల్ నంబర్‌కు మెసేజ్ పంపించాం’ అని తెలిపారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios