ఛత్తీస్‌ఘడ్ :  మావోయిస్టుల చెరనుండి విడుదలైన  కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్  ను  బెటాలియన్ అధికారులు  వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో కోబ్రా  కమాండో జవాన్ రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు ప్రజా కోర్టులో వదిలివెళ్లారు.  ప్రజాకోర్టులో మధ్యవర్తుల చర్చలతో  మావోయిస్టులు  రాకేశ్వర్ సింగ్ ను వదిలిపెట్టారు.

also read:జవాన్ రాకేశ్వర్ సింగ్ ను ప్రజా కోర్టులో విడుదల చేసిన మావోయిస్టులు ( వీడియో)...

మావోయిస్టుల చెర నుండి విడుదలైన రాకేశ్వర్ సింగ్  ను అధికారులు బీజాపూర్ ఆసుపత్రికి శుక్రవారం నాడు తరలించారు.  బీజాపూర్ ఆసుపత్రిలో చికిత్సలు పూర్తైన తర్వాత  రాకేశ్వర్ సింగ్ ను  జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని స్వంత గ్రామానికి పంపనున్నారు.తన తండ్రికి వదిలివెళ్లాలని  ఇటివలనే రాకేశ్వర్ సింగ్ కూతురు కన్నీటితో వేడుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ నెల 3 వ తేదీన ఛత్తీస్‌ఘడ్ లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ లో  సుమారు 24 మంది జవాన్లు మరణించారు.  సుమారు 31 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ సమయంలోనే రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు తమ బందీగా తీసుకెళ్లారు. మధ్యవర్తుల చర్చల తర్వాత నిన్న ఆయనను వదిలివెళ్లారు.