Asianet News TeluguAsianet News Telugu

కోబ్రా కమాండో మా వద్ద బందీగా: ఛత్తీస్‌ఘడ్ లో మావోల లేఖ

బీజాపూర్ ఎన్ కౌంటర్ సమయంలో కోబ్రా కమాండో కు చెందిన ఓ జవాన్ తమ ఆధీనంలో ఉన్నట్టుగా మావోయిస్టులు ప్రకటించారు.

Cobra Commando abuducted by Maosits, seach on lns
Author
New Delhi, First Published Apr 5, 2021, 5:32 PM IST

రాయ్‌పూర్: బీజాపూర్ ఎన్ కౌంటర్ సమయంలో కోబ్రా కమాండో కు చెందిన ఓ జవాన్ తమ ఆధీనంలో ఉన్నట్టుగా మావోయిస్టులు ప్రకటించారు.

రాష్ట్రంలోని బీజాపూర్ అడవుల్లో మావోయిస్టులు జరిగిన కాల్పుల్లో 23 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.శనివారం నాడు  మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 23 మంది జవాన్లు మరణించారు. 660 మంది జవాన్లు కూంబింగ్ కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

కోబ్రా కమాండో రాకేశ్ సింగ్ తమ వద్దే బందీగా ఉన్నాడని మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు.ఆపరేషన్ ప్రహార్-3ను వెంటనే నిలిపివేయాలని మావోయిస్టులు ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో పాటు పలు డిమాండ్లను ఆ లేఖలో ఉంచారు. మరోవైపు ఈ నెల 26న భారత్ బంద్ కు పిలుపునిస్తున్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు.

 మరోవైపు స్థానిక రిపోర్టర్లకు కూడ మావోయిస్టులుగా పరిచయం చేసుకొన్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూడ ఫోన్ ద్వారా ఇదే సమాచారం ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో రాకేష్ సింగ్ ను క్షేమంగా విడుదల చేస్తామని మావోయిస్టులు  చెప్పారని స్థానిక రిపోర్టర్లు తెలిపారు. 

స్థానిక రిపోర్టర్లకు వచ్చిన ఫోన్ కాల్స్ పై పోలీసులు దర్యాప్తు చేశారు. ఓ కీలక మావోయిస్టు దళం నుండి ఆ ఫోన్ కాల్ వచ్చిందని సీనియర్ అధికారి తెలిపారు.మావోయిస్టు దళం ఆధీనంలో కోబ్రా కమాండో ఉన్నాడా లేడా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios