దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు గనుల కుంభకోణంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పశ్చిమ బెంగాల్‌లో బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అవకతవకల్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాతో పాటు మరో ఐదుగురిని హైకోర్టు దోషులుగా నిర్థారించింది. 

యూపీఏ ప్రభుత్వం హయాంలో ఆయన బొగ్గు గనుల శాఖ కార్యదర్శిగా రెండు సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. గుప్తా ఛైర్మన్‌గా స్క్రీనింగ్ కమిటీ బొగ్గు గనుల హక్కుల కేసుల్లో 40 కేసులను క్లియర్ చేసింది. అనేక మంది అవినీతిపరులకు క్లీన్ చీట్ ఇచ్చింది..

బొగ్గు గనుల కేటాయింపులో అవినీతికి పాల్పడటంతో పాటు, పారదర్శక విధానంలో వేలం వేయకపోవడం, కోట్లలో పన్నుల ఎగవేతకు గుప్తా కారకులయ్యారు.. దీనితో పాటుగా మరో ఎనిమిది కేసుల్లో గుప్తా నిందితుడిగా ఉన్నారు. వీరందరిని తక్షణం కస్టడిలోకి తీసుకోవాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.