యూపీ సీఎం యోగి మెచ్చిన ఆంధ్ర ప్రదేశ్ గోవులు ... ఎంత ముద్దుగా వున్నాయో చూడండి

ఆంధ్రప్రదేశ్  కు చెందిన రెండు అరుదైన పుంగనూరు జాతి దూడలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయ గోశాలకు స్వాగతం పలికారు. వాటికి బెల్లం తినిపించి ప్రేమగా ఒళ్లంతా నిమిరి జంతుప్రేమను చాటుకున్నారు. 

CM Yogi welcomes Punganur calves to Gorakhnath Temple AKP

గోరఖ్‌పూర్ : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పుంగనూరు జాతి గోవులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పుంగనూరు దూడతో కనిపించగా తాజాగా ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ ఆవులతో కనిపించారు. చిన్నగా, ఆకర్షనీయంగా వుండే  ఈ పుంగనూరు జాతి ఆవులు ఇంట్లో పెంచుకోడానికి అనువుగా వుంటాయి.  

శుక్రవారం ఉదయం పుంగనూరు జాతి ఆవులను గోరఖ్‌నాథ్ ఆలయంలోని గోశాలకు తీసుకువచ్చారు. ఇలా చిన్ సైజులో ఆకర్షనీయంగా వున్న ఈ రెండు పుంగనూరు దూడలు అందరి దృష్టిని ఆకర్షించాయి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వాటిని ప్రేమగా నిమిరి, తన చేతులతో బెల్లం తినిపించారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి యోగి గోరఖ్ పూర్ పర్యటనలో వున్నారు. గురువారం మధ్యాహ్నమే గోరఖ్‌పూర్‌కు చేరుకున్న ఆయన రాత్రి అక్కడే బసచేసారు. ఇవాళ(శుక్రవారం) ఉదయం సాంప్రదాయబద్ధంగా తన దినచర్యను ప్రారంభించారు. గోరఖ్‌నాథ్ ఆలయంలో గురు గోరఖ్‌నాథ్‌ ను పూజించారు... అనంతరం తన గురువు దివంగత మహంత్ అవేద్యనాథ్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. 

గోరఖ్ నాథ్ ఆలయంలో ఉన్నప్పుడల్లా ఆవులకు సేవ చేయడం యోగి దినచర్యగా వుండేది. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన గోరఖ్ పూర్ లో వుండటంలేదు.  ఎప్పుడైనా స్వస్థలానికి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా గోసేవ చేస్తారు. అయితే ఈసారి మాత్రం ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పుంగనూరు జాతి ఆవులను ఆయన ప్రేమగా చూసుకోవడం ప్రాముఖ్యత సంతరించుకుంది. 

 

యోగి ఆదిత్యనాథ్ ఆ దూడలను ప్రేమగా చూసుకుంటూ, వాటి నుదుటిని, మెడను సున్నితంగా నిమిరారు.  వాటికి తన చేతులతో బెల్లం తినిపించే ముందు కొన్ని క్షణాలు వాటిని ఆప్యాయంగా నిమిరారు. ఇలా పుంగనూరు ఆవులతో పాటు గోశాలలోని ఇతర ఆవులతో కూడా సమయం గడిపారు. ఆయన గోశాల చుట్టూ తిరుగుతుండగా, శ్యామా, గౌరీ, గంగా, భోలా వంటి పేర్లతో ఆవులను ప్రేమగా పిలిచారు. ఆయన స్వరాన్ని బాగా తెలిసిన ఆవులు పరుగున ఆయన వద్దకు వచ్చాయి. 

ముఖ్యమంత్రి వాటి నుదుటిని నిమిరి, వాటిపై అపారమైన ప్రేమను కురిపించారు. ఆవులన్నింటికి  బెల్లం తినిపించారు. గోశాల కార్మికులను అన్ని ఆవుల ఆరోగ్యం, పోషణ గురించి అడిగి తెలుసుకున్నారు, వాటి సంరక్షణ కోసం అవసరమైన సూచనలు అందించారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios