పండిత్ రామ్‌కింకర్ ఉపాధ్యాయ్‌కు సీఎం యోగి నివాళి ... ఇంతకీ ఎవరీయన?

పండిత్ రామ్‌కింకర్ ఉపాధ్యాయ్ శతాబ్ది జన్మదినోత్సవ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామజన్మభూమి ఉద్యమంలో రామ్‌కింకర్ చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు.

CM Yogi Pays Tribute to Pt Ram Kinkar Upadhyay on Birth Centenary akp

లక్నో : ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌లో నిర్వహించిన ‘భావాంజలి’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.  పద్మభూషణ్ పురస్కార గ్రహీత పండిత్ రామ్‌కింకర్ ఉపాధ్యాయ్ శతాబ్ది జన్మధినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి రామ్‌కింకర్ ను కొనియాడుతూ, ఆయన సేవలను, సనాతన ధర్మం పట్ల ఆయనకున్న అంకితభావాన్ని స్మరించుకున్నారు.

మహాపురుషుల సేవలను గుర్తుంచుకోవడం మన బాధ్యత

ఈ కాలపు ఓ మహాపురుషుడి శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనడం తనకు చాలా గర్వకారణమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆయన జీవితం సనాతన ధర్మం,  శ్రీరాముడి ఆదర్శాలపై ఆధారపడిందని అన్నారు. ఆయన జీవితమంతా శ్రీరాముడు, తులసి సాహిత్యానికి అంకితం చేశారన్నారు. ఆయన వ్యాఖ్యానాలు, ఆలోచనలు ప్రత్యేకమైనవి. అవి సనాతన ధర్మ అనుయాయులకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయన్నారు.

 సీఎం యోగి యజుర్వేదాన్ని ఉదహరిస్తూ మహాపురుషుల లక్షణాల గురించి మాట్లాడారు. శాస్త్రాలలో రెండు రకాల పురుషుల గురించి చర్చ ఉందని, ప్రాకృత పురుషుడు, విశిష్ట పురుషుడని అన్నారు. రామ్‌కింకర్ జీ జీవితమంతా విశిష్టతకు ప్రతీక. ఆయన చేసిన పని, దాని ఫలితాలు ఆయన సమాజానికి ఎలా ప్రేరణనిచ్చారో తెలియజేస్తాయి.

CM Yogi Pays Tribute to Pt Ram Kinkar Upadhyay on Birth Centenary akp

శ్రీరామ కథకు ప్రత్యేక శైలిని ప్రారంభించారు

పండిత్ రామ్‌కింకర్ ఉపాధ్యాయ్ శ్రీరామ కథ ప్రత్యేక శైలి గురించి ప్రస్తావిస్తూ, ఆయన రామకథకు కొత్త దిశా నిర్దేశం చేశారని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన కథలు సామాన్యులను మాత్రమే కాకుండా, దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులను కూడా ప్రభావితం చేశాయన్నారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా ఆయన మానస్ ద్వారా సనాతన ధర్మానికి సేవ చేశారు. అలాంటి మహాపురుషుల పట్ల మనం గౌరవం చూపించాలని, వారి బోధనలను ప్రజలకు చేరవేయాలని ముఖ్యమంత్రి అన్నారు.

రామ్‌కింకర్ ఉపాధ్యాయ్ శతాబ్ది పుట్టినరోజు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత శ్రీరామ్‌లల్లా అయోధ్యలో కొలువైన సంవత్సరం ఇది. ఇది నిజమైన భక్తికి, శ్రద్ధకు అద్భుతమైన ఉదాహరణ. ఈ గొప్ప సంఘటన రామ్‌కింకర్ జీ శ్రద్ధ, అంకితభావానికి ప్రతీక అని ముఖ్యమంత్రి అన్నారు.

రామజన్మభూమి ఉద్యమంలో రామ్‌కింకర్ ఉపాధ్యాయ్ కథలు కీలక పాత్ర పోషించాయని ముఖ్యమంత్రి అన్నారు. తులసీదాస్ జీ విదేశీ దురాక్రమణదారుల కాలంలో చేసినట్లుగానే రామ్‌కింకర్ జీ కథలు ప్రజలను చైతన్యపరిచాయన్నారు. తులసీదాస్ జీ అప్పటి బాద్షా ఆస్థానా కవిగా ఉండటానికి నిరాకరించి, ప్రభువు శ్రీరాముడిని భారతదేశ ఏకైక రాజుగా ప్రకటించారు. ఆయన గ్రామాల్లో రామలీలలను ప్రారంభించారు. ఆ సంప్రదాయం నేటికీ ప్రభుత్వ సహాయం లేకుండానే కొనసాగుతోంది. దీనివల్ల సనాతన ధర్మ విలువలు మరింత బలపడుతున్నాయి.

CM Yogi Pays Tribute to Pt Ram Kinkar Upadhyay on Birth Centenary akp

మహాపురుషుల జ్ఞాపకాలను కాపాడుకోవాలి

మహాపురుషుల జ్ఞాపకాలను కాపాడుకోవడం, వాటిని సామాన్యులకు చేరవేయడం చాలా ముఖ్యమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ సంవత్సరం పండిత్ రామ్‌కింకర్ ఉపాధ్యాయ్   శతాబ్ది జయంతి. ఆయన జ్ఞాపకాలను స్మారక గ్రంథంగా భద్రపరిచి ప్రజలకు అందించాలి. తద్వారా ఆయన జీవితం, ఆయన చేసిన పనులు భావితరాలకు ప్రేరణగా నిలుస్తాయి.

భావాంజలి కార్యక్రమ నిర్వాహకుడు కిషోర్ టాండన్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆయన తాత బిషన్ చంద్ర సేథ్ గోరక్షపీఠ్ భక్తుడని అన్నారు. బిషన్ చంద్ర సేథ్ తీవ్ర హిందుత్వవాది, తన కాలంలో అద్భుతమైన వ్యాఖ్యాత అని, తన వాదనల ముందు ఎవరికీ తలవంచలేదని సీఎం యోగి అన్నారు. ఆయన కుటుంబం నేటికీ అదే నిబ్బరంతో ధార్మికంగా జీవిస్తోంది.

రామ్‌కింకర్ జీ అంకితభావం, భక్తికి ప్రతీక

కార్యక్రమం చివరలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పండిత్ రామ్‌కింకర్ ఉపాధ్యాయ్‌కు నివాళులర్పించారు. ఆయన జీవితమంతా రామచరిత మానస్, తులసి సాహిత్యానికి అంకితం చేశారని అన్నారు. ప్రభువు శ్రీరాముడు తన భక్తుడి అమరత్వాన్ని, కీర్తిని కొనసాగించాలని, సనాతన ధర్మ అనుయాయులకు మార్గదర్శకంగా ఉండాలని ప్రార్థించారు.

భావాంజలి కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ దినేష్ శర్మ, శ్రీరామాయణ ట్రస్ట్ అధ్యక్షురాలు సాధ్వీ మందాకిని, ప్రఖ్యాత కథా వ్యాఖ్యాత పండిత్ ఉమాశంకర్ శర్మ, కిషోర్ టాండన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios