మహా కుంభమేళా కోసం సిద్దమవుతున్న ప్రయాగరాజ్ ఎయిర్ పోర్ట్ ... సీఎం ఆకస్మిక తనిఖీ

ప్రయాగరాజ్ ఎయిర్‌పోర్ట్‌ను సీఎం యోగి ఆకస్మికంగా తనిఖీ చేసారు.  మహాకుంభ్ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన జనవరి మొదటి వారం నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

CM Yogi Inspects Prayagraj Airport Ahead of Mahakumbh 2025 AKP

ప్రయాగరాజ్ : మహా కుంభమేళా ఏర్పాట్లను సమీక్షించడానికి వచ్చిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగరాజ్ ఎయిర్ పోర్ట్ లో ఏర్పాట్లను పరిశీలించారు. మహా కుంభమేళా కోసం ఎయిర్ పోర్ట్ లో వసతులను మెరుగుపర్చడంతో పాటు విస్తరణ పనులు జరుగుతున్నాయి.. వాటిని సీఎం పరిశీలించారు. అలాగే సుబేదార్‌గంజ్ ఫ్లైఓవర్‌ను కూడా యోగి తనిఖీ చేసారు.

ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి మొత్తం ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులకు అవసరమైన సూచనలు చేశారు యోగి. ఈ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన జనవరి మొదటి వారంలోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మహా కుంభమేళా సందర్భంగా ఎయిర్‌పోర్ట్ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాగరాజ్‌కు వస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని త్వరగా పనులు పూర్తిచేయాలని  సీఎం యోగి ఆదేశించారు.

యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు

ప్రయాగరాజ్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ముఖేష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  బిజీ షెడ్యూల్ లోనూ సమయం కేటాయించి ఎయిర్‌పోర్ట్‌లో మహాకుంభ్ ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చారని తెలిపారు. పాత భవనం, పార్కింగ్ విస్తరణ పనులతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త భవనంలో జరుగుతున్న విస్తరణ పనులను కూడా పరిశీలించారు. మొత్తం ఏర్పాట్లతో ఆయన సంతోషంగా ఉన్నారు.

జనవరి 13 నుంచి మహాకుంభ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రయాణికుల రాకపోకలు పెరుగుతాయి... కాబట్టి జనవరి మొదటి వారంలోగా ఎయిర్‌పోర్ట్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన స్పష్టంగా ఆదేశించారు. ముఖ్యమంత్రి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాట్లను పరిశీలించారని ముఖేష్ ఉపాధ్యాయ తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ సైట్‌లో మొత్తం లేఅవుట్ ప్లాన్‌ను కూడా పరిశీలించారు.

ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ 31 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. మహాకుంభ్ కోసం ఎయిర్‌పోర్ట్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని, పగలు, రాత్రి విమానాలు దిగడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios