జ్ఞానవాపి ఆ మహనీయుడి తపోమందిరం : యూపీ సీఎం యోగి సంచలనం

జ్ఞానవాపి అంటే విశ్వనాథుడేనని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆది శంకరులు, భగవాన్ శివుడి ప్రస్తావనను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

CM Yogi inaugurates seminar on Contribution of Nathpanth in building a harmonious society AKP

గోరఖ్‌పూర్ : దేశ నలుమూలలా ఆధ్యాత్మిక పీఠాలను స్థాపించిన ఆది శంకరాచార్యులు కాశీలో తపస్సు చేస్తున్న సమయంలో భగవాన్ విశ్వనాథుడు పరీక్షించిన ఘటనను ఉదహరిస్తూ.. దురదృష్టవశాత్తూ నేడు కొందరు మసీదు అని పిలుస్తున్న జ్ఞానవాపి విశ్వనాథడిదేనని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

సీఎం యోగి శనివారం దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ‘సామరస్య సమాజ నిర్మాణంలో నాథ్‌పంత్ సహకారం’ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం, హిందూస్థానీ అకాడమీ ప్రయాగరాజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. దీక్షా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, నాథ్‌పంత్ పీఠం, గోరక్ష పీఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు.

సాధువులు, ఋషుల సంప్రదాయం సమాజాన్ని, దేశాన్ని కలిపేదని ఆది శంకరాచార్యులు చెప్పారన్నారు. కేరళలో జన్మించిన ఆది శంకరాచార్యులు దేశ నలుమూలలా ధర్మ ప్రచారానికి పీఠాలను స్థాపించారని చెప్పారు. ఇలా ఆ మహనీయుడు కాశీకి వచ్చినప్పుడు భగవాన్ విశ్వనాథుడు ఆయనను పరీక్షించాలనుకున్నారని తెలిపారు. ఆ కథను స్వయంగా  యోగి చెప్పారు. 

బ్రహ్మ ముహూర్తంలో ఆది శంకరాచార్యులు గంగా స్నానానికి వెళ్తుండగా ఆ దేవదేవుడే అంటరాని వ్యక్తి రూపంలో ఆయన ముందు నిలబడ్డారని వివరించారు. దారిలోంచి తప్పుకోమని  శంకరాచార్యులు కోరగా.. మీరు అద్వైత జ్ఞానంతో ఉన్నప్పుడు శరీరాన్ని చూడకూడదు... బ్రహ్మమే సత్యమైతే మీలో ఉన్న బ్రహ్మమే నాలోనూ ఉందని ప్రశ్నించారని చెప్పారు. దీంతో ఆశ్చర్యపోయిన శంకరాచార్యులు ఆ వ్యక్తిని మీరు ఎవరని ప్రశ్నించగా... మీరు ఎవరికోసం కాశీకి వచ్చి జ్ఞానవాపిలో తపస్సు చేస్తున్నారో ఆయననే అని చెప్పారంటూ కథను ముగించారు. దీన్నిబట్టే జ్ఞానవాపి అంటే విశ్వనాథుడేనని ముఖ్యమంత్రి యోగి తెలిపారు.

CM Yogi inaugurates seminar on Contribution of Nathpanth in building a harmonious society AKP

ఋషులు, సాధువుల సంప్రదాయం ఎల్లప్పుడూ కలిపేదే :

భారతీయ ఋషులు, సాధువుల సంప్రదాయం ఎల్లప్పుడూ ప్రజలను కలిపేదేనని సీఎం యోగి అన్నారు. ఈ సాధువులు, ఋషుల సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి సమానత్వం, సామరస్య సమాజానికి ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. మన సాధువులు, ఋషులు అంటరానితనం, అస్పృశ్యతను దూరంపెట్టి జాతీయ సమైక్యత, సమగ్రతను బోధించారని యోగి తెలిపారు.  

అస్పృశ్యత లేకపోతే దేశం ఎప్పుడూ బానిసగా ఉండేది కాదు

అస్పృశ్యతను తొలగించడంపై దృష్టి సారించి ఉంటే దేశం ఎప్పుడూ బానిసగా ఉండేది కాదని ముఖ్యమంత్రి అన్నారు. సాధువుల సంప్రదాయం సమాజంలో అంటరానితనం, అస్పృశ్యతకు ఎప్పుడూ ప్రాధాన్యతనివ్వలేదని చెప్పారు. నాథ్‌పంత్ కూడా అదే సంప్రదాయాన్ని పాటించారని తెలిపారు. నాథ్‌పంత్ ప్రతి కులం, మతం, ప్రాంతానికి గౌరవం ఇచ్చారు... అందరినీ కలిపే ప్రయత్నం చేసారని వివరించారు. నాథ్‌పంత్ ఒకవైపు ఆధ్యాత్మిక ఉన్నతిపై దృష్టి సారించి, మరోవైపు సమాజంలోని ప్రతి వర్గాన్ని కలిపే ప్రయత్నం చేసారని ముఖ్యమంత్రి అన్నారు.

CM Yogi inaugurates seminar on Contribution of Nathpanth in building a harmonious society AKP

గురు గోరఖ్‌నాథ్ పదాలు, దోహాలలో సామాజిక సామరస్యత

మహా యోగి గురు గోరఖ్‌నాథ్‌జీ చెప్పిన పదాలు, దోహాలు సమాజాన్ని కలిపేలా, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించేలా ఉంటాయని సీఎం యోగి అన్నారు. తన బోధనలు కూడా సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడానికే అంకితం చేశారని చెప్పారు. మాలిక్ ముహమ్మద్ జాయసీ కూడా.. ‘గురువు లేకుండా మార్గాన్ని కనుగొనలేము, గోరఖ్‌ను కలిస్తేనే యోగి సిద్ధుడవుతాడు’ అని చెప్పారని గుర్తు చేశారు. సాధువులు కబీర్‌దాస్‌జీ కూడా ఆయన ఘనతను కీర్తించారని గుర్తుచేసారు. 

 దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ నాథ్‌పంత్ ముద్ర

నాథ్‌పంత్ సంప్రదాయం దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఉన్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇటీవల అయోధ్యలో తమిళనాడుకు చెందిన ప్రముఖ సాధువును కలిసిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ఆ సాధువు ద్వారా నాథ్‌పంత్ రాతప్రతులు తనకు లభించాయని చెప్పారు. గోరఖ్‌నాథ్‌జీకి సంబంధించిన అనేక తపో ప్రదేశాలు, నాథ్‌పంత్ సంప్రదాయాలు నేటికీ ఉన్నాయని తెలిపారు. కర్ణాటక సంప్రదాయంలో ప్రస్తావించబడిన మంజునాథ్ గోరఖ్‌నాథ్‌జీ అని చెప్పారు. మహారాష్ట్రలోని సాధువు జ్ఞానేశ్వర్ దాస్ సంప్రదాయం కూడా మత్స్యేంద్రనాథ్‌జీ, గోరఖ్‌నాథ్‌జీ, నివృత్తినాథ్‌జీలకు సంబంధించినదేనని వివరించారు.

మహారాష్ట్రలో రామచరితమానస్ తరహాలోనే నవనాథుల పారాయణ సంప్రదాయం ఉందని తెలిపారు. పంజాబ్, సింధ్, త్రిపుర, అస్సాం, బెంగాల్ వంటి రాష్ట్రాలతోపాటు నేపాల్, బంగ్లాదేశ్, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వంటి అనేక దేశాల్లో నాథ్‌పంత్ విస్తరించి ఉందని చెప్పారు. నాథ్‌పంత్ సంప్రదాయానికి చెందిన చిహ్నాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, వాటిని ఒక మ్యూజియంలో భద్రపరచాలని ముఖ్యమంత్రి అన్నారు. గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయంలోని మహా యోగి గురు గోరఖ్‌నాథ్ పరిశోధన పీఠం ఈ దిశగా చొరవ తీసుకోవచ్చని సూచించారు. నాథ్‌పంత్ ఎన్‌సైక్లోపీడియాలో నాథ్‌పంత్‌కు సంబంధించిన అన్ని అంశాలు, నాథ్ యోగుల చిహ్నాలను సేకరించేందుకు ప్రయత్నించాలని పరిశోధన పీఠాన్ని కోరారు.

దేశాన్ని కలిపే ఆచరణాత్మక భాష హిందీ

అందరికీ రాజ్‌భాషా హిందీ దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. హిందీ దేశాన్ని కలిపే ఆచరణాత్మక భాష అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దీని మూలం దేవ భాష సంస్కృతమని చెప్పారు.  భాష పట్ల భారతేందు హరిశ్చంద్రకు ఉన్న భావన నేటికీ ఆకర్షిస్తుందని... భావన, భాష మన స్వంతం కాకపోతే ప్రతి స్థాయిలోనూ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా దేశాన్ని కలపడానికి హిందీని ప్రపంచానికి పరిచయం చేసిన విధానం అభినందనీయమని ముఖ్యమంత్రి అన్నారు.

 

CM Yogi inaugurates seminar on Contribution of Nathpanth in building a harmonious society AKP

నాథ్‌పంత్‌లో శ్రవణ, భ్రమణ సంప్రదాయాలు రెండూ ఉన్నాయి

నాథ్‌పంత్‌లో శ్రవణ, భ్రమణ సంప్రదాయాలు రెండూ ఉన్నాయని ఆయన అన్నారు. ఇది సామాజిక సామరస్యం, త్యాగం, మానవ కళ్యాణం, సర్వ కళ్యాణ భావనలతో నిండిన మతమని చెప్పారు. హిందీ దివస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందీ, హిందుత్వం, జాతీయవాదానికి ప్రతీక అని వర్ణించారు. ఆయనను ఆదర్శ ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ.. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా యోగి ఆదిత్యనాథ్ వంటి ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారని ప్రొ. త్రిపాఠి అన్నారు.

నాథ్‌పంత్ సామాజిక సామరస్యానికి ప్రాణం పోసింది: ప్రొ. పూనమ్ టండన్

సదస్సుకు అధ్యక్షత వహించిన దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ వైస్‌ఛాన్సలర్ ప్రొ. పూనమ్ టండన్ మాట్లాడుతూ.. నాథ్‌పంత్ సామాజిక సామరస్యానికి ప్రాణం పోసిందని అన్నారు. నాథ్‌పంత్ స్థాపకుడు మహా యోగి గోరఖ్‌నాథ్‌జీ సామాజిక సామరస్యం, సామాజిక సమైక్యత, జాతీయ సమగ్రతలకు ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. నేడు సమాజం భాషావాదం, కులతత్వం, ప్రాంతీయతత్వం వంటి వాటి కారణంగా విచ్ఛిన్నమవుతోందని ప్రొ. టండన్ అన్నారు. సమాజంలో సామరస్యం లేకపోవడం జాతీయతకు ముప్పు అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో నాథ్‌పంత్ భావజాలం మనకు దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. నాథ్‌పంత్ తత్వశాస్త్రం, ఆలోచనలు మన సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం అని అన్నారు.  

 

CM Yogi inaugurates seminar on Contribution of Nathpanth in building a harmonious society AKP

దివ్యాంగుల క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం ఆవరణలో దివ్యాంగుల క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ క్యాంటీన్‌ను దివ్యాంగులే నిర్వహిస్తారు. క్యాంటీన్‌ను ప్రారంభించిన తర్వాత సీఎం యోగి నిర్వాహకులను ప్రోత్సహించారు.

CM Yogi inaugurates seminar on Contribution of Nathpanth in building a harmonious society AKP

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios