యువతరమా... ఫోన్లు వీడి దీన్ని అలవాటు చేసుకొండి : యోగి పిలుపు

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోమతి పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలు పుస్తకాలను చదివే అలవాటును అలవర్చుకోవాలని సూచించారు.  

CM Yogi Inaugurates Gomti Book Festival Lucknow Encourages Reading Habits AKP

లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోమతి రివర్ ఫ్రంట్ పార్కులో గోమతి పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. నేషనల్ బుక్ ట్రస్ట్, లక్నో అభివృద్ధి ప్రాధికార సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మహోత్సవం నవంబర్ 9 నుంచి 17 వరకు జరగుతుంది.

ఈ సందర్భంగా సీఎం యోగి పిల్లలు పాఠ్యపుస్తకాలతో పాటు సృజనాత్మక, జ్ఞానాన్ని అందించే పుస్తకాలు చదవాలని సూచించారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా మంచి పుస్తకాలు చదివి, మంచి విషయాలు నేర్చుకోవాలన్నారు. పిల్లలందరూ మేళాలో ఒక్కో పుస్తకం కొనాలని, దీనివల్ల వారిలో పుస్తక పఠన అలవాటు పెరుగుతుందని కోరారు.

 

డిజిటల్ యుగంలో పిల్లలపై చూపిస్తున్న ప్రభావం గురించి చెబుతూ ఆందోళన వ్యక్తం చేసారు యోగి. ఈ రోజుల్లో యువత 24 గంటల్లో దాదాపు 6 గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర డిజిటల్ పరికరాల్లో గడుపుతున్నారని సీఎం అన్నారు. ఈ సమయాన్ని ఏదైనా సార్థకమైన పనికి ఉపయోగిస్తే, అది సమాజానికి, యువతకు మేలు చేస్తుందన్నారు. సాంకేతికతను ఉపయోగించుకోవాలి కానీ దానికి బానిసలు కాకూడదని సూచించారు.

భారతదేశపు ప్రాచీన జ్ఞాన సంప్రదాయం గురించి ప్రస్తావిస్తూ... మన సాహితీ సంప్రదాయం చాలా లోతైనదని సీఎం అన్నారు. నైమిశారణ్యం వంటి పవిత్ర ప్రదేశాల్లో ఋషులు జ్ఞానాన్ని లిఖితబద్ధం చేశారని... దీనివల్ల అది తీర్థక్షేత్రంగా మారిందని చెప్పారు. వినడం, ఆలోచించడం, ఆచరించడం మన సంప్రదాయమని...దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని అన్నారు.

ఉత్తరప్రదేశ్ గడ్డ ఎంతో అదృష్టం చేసుకుని వుంటుంది.. అందువల్లే ఇక్కడ వాల్మీకి, తులసీదాస్ వంటి మహాకవులు జన్మించారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రామచరితమానస్ ఇంటింటా పాడతారని, యుద్ధభూమిలో కూడా భగవద్గీత వంటి జ్ఞాన గ్రంథం రచించబడిందని... మన గొప్ప సంప్రదాయాని చూసి గర్వించాలని, దాన్ని కాపాడుకోవాలని అన్నారు.

పుస్తకమేళా నిర్వహకులపై యోగి ప్రశంసలు

 నేషనల్ బుక్ ట్రస్ట్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్‌లోని అన్ని 18 మండలాల్లో ఇలాంటి పుస్తక మేళాలు నిర్వహించాలని సూచించారు. ఇలాంటి మేళాల వల్ల సమాజంలోని అన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూరుతుందని, ప్రజల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెరుగుతుందని అన్నారు. డిజిటల్ పరికరాల్లో గడిపే సమయాన్ని తగ్గించి, పుస్తకాలు చదవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. పుస్తకాలు మన ఆలోచనలను విస్తృతం చేస్తాయి, సమాజం పట్ల అవగాహన కల్పిస్తాయని, కొత్త తరాన్ని ఈ దిశగా ప్రోత్సహించాలని సీఎం అన్నారు.

గోమతి పుస్తక మహోత్సవం మూడో ఎడిషన్‌కు రచయితలు, ప్రముఖులు, పుస్తక ప్రియులు తరలివచ్చారు. నేషనల్ బుక్ ట్రస్ట్ అధ్యక్షుడు ప్రొఫెసర్ మిలన్ మరాఠీ, డైరెక్టర్ కల్నల్ యువరాజ్ మాలిక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అవనీష్ అవస్థి, మండల కమిషనర్ రోషన్ జాకబ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం యోగి స్వయంగా పుస్తకాలను పరిశీలించి, నిర్వాహకులను అభినందించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios