వైద్యరంగంలో యోగి సర్కార్ మ్యాజిక్ : ఏమేం చేసారో తెలుసా?
వారణాసిలో ఏర్పాటుచేసిన శంకర్ నేత్ర చికిత్సాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
వారణాసి: ప్రధాని మోడీ స్ఫూర్తితో కాశీలో సేవా, అభివృద్ధి యజ్ఞంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. గత పదేళ్లలో కాశీ ఎంతగానో అభివృద్ధి చెందింది... సరికొత్త రూపాన్ని సంతరించుకుందని అన్నారు.
వారణాసిలో శంకర్ ఐ హాస్పిటల్స్ రెెండో శాఖను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కంచీ కామకోటి పీఠం శంకరాచార్య జగద్గురు శంకర్ విజయేంద్ర సరస్వతి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి మాట్లాడుతూ... విద్య, వైద్య రంగాల్లో యూపీ కొత్త ప్రమాణాలు సృష్టించిందన్నారు. కాశీలో రూ.2,500 కోట్లతో వైద్య రంగానికి చెందిన పనులు జరిగాయని తెలిపారు. పండిట్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ హాస్పిటల్, హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్, 430 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బీహెచ్‌యూలో 100 పడకల ఎంసీహెచ్ విభాగం, ఈఎస్ఐసీ హాస్పిటల్‌లో 150 పడకల సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం జరిగిందని యోగి తెలిపారు.
ఇక ఇప్పటికే యూపీలో శంకర్ ఐ హాస్పిటల్ సేవలు అందుబాటులో వుండగా కాశీలో మరో బ్రాంచ్ ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు. ఈ శంకర్ ఐ ఫౌండేషన్ దేశంలో నేత్ర రోగులకు కొత్త జీవితాన్ని అందిస్తోందన్నారు. 1977లో పూజ్య శంకరాచార్య స్ఫూర్తితో ప్రారంభమైన ఈ కార్యక్రమం దేశంలోని వివిధ ప్రాంతాల్లో శంకర్ ఐ హాస్పిటళ్ల ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతోందని యోగి ప్రశంసించారు.
పదేళ్లలో యూపీ వైద్య రంగంలో జరిగిన అద్భుతాలు
కాశీలాగే ఉత్తరప్రదేశ్‌లో కూడా పదేళ్లలో వైద్య రంగంలో అద్భుతమైన పనులు జరిగాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ, డయాలసిస్, సిటీ స్కాన్ సౌకర్యాలతో పాటు, 15 వేలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్యకేంద్రాల ద్వారా గ్రామీణ ప్రజలకు వైద్యం, సాంప్రదాయ వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నాారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఈ కార్యక్రమం వేగంగా అమలవుతోందన్నారు. వైద్యరంంగంలో. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్, ధార్మిక సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయని... వీరి సహకారం చాలా కీలకమని సీఎం యోగీ అన్నారు.
కార్యక్రమంలో గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, డాక్టర్ ఎస్వీ బాలసుబ్రమణ్యం, డాక్టర్ ఆర్వీ రమణి, మురళీ కృష్ణమూర్తి, రేఖా జున్‌జున్‌వాలా తదితరులు పాల్గొన్నారు.