అతడో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ఆయన ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చివరకు కొరడా దెబ్బలు కూడా తిన్నారు. ఆయనే చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్.  

దీపావళి పండగ సందర్భంగా చత్తీస్ ఘడ్ లోని దుర్గ్ జిల్ల జజంగిరి గ్రామంలో వింత ఆచారాన్ని పాటిస్తారు. పండగ పూట జరిపే గోవర్దన పూజలో పాల్గొనేవారు కొరడా దెబ్బలు తింటే శుభం కలుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. ఈసారి ఈ పూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి బఘేల్ కూడా యావత్ రాష్ట్ర ప్రజానికం క్షేమంగా వుండాలని కొరడా దెబ్బలకు సిద్దపడ్డారు. తన చేతి మీద పలుమార్లు కొరడాతో కొట్టించుకున్నారు ముఖ్యమంత్రి.