కొత్త సీఎం పంజాబ్ ను అభివృద్ధి పథంలోకి తీసుకొస్తాడని ఆశిస్తున్నానని పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ అన్నారు. కొత్తగా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన భగవంత్ మాన్ కు ఆయన అభినందనలు తెలియజేశారు.
పంజాబ్ రాష్ట్ర 17వ సీఎంగా భగవంత్ మాన్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్ ఈ ప్రమాణస్వీకార వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో కొత్త సీఎంకు పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. భగవంత్ మాన్ పంజాబ్ ను అభివృద్ధి చేస్తాడని ఆకాంక్షించారు.
‘‘ఎవరూ ఊహించని వ్యక్తి సంతోషకరమైన వ్యక్తి భగవంత్ మాన్. పంజాబ్‌లో కొత్త మాఫియా వ్యతిరేక శకాన్ని అంచనాల పర్వంతో ఆవిష్కరిస్తాడు. ఆయన ఆ సందర్భానికి తగినట్లుగా ఎదుగుతాడని, ప్రజల అనుకూల విధానాలతో పంజాబ్‌ను ఎల్లప్పుడూ ఉత్తమమైన పునరుజ్జీవన పథంలోకి తీసుకువస్తాడని ఆశిస్తున్నాను ’’ అంటూ నవజ్యోత్ సింగ్ సిద్దూ ట్వీట్ చేశారు.
ఖట్కర్ కలాన్ లో ఆయన ప్రామాణ స్వీకారం పూర్తి చేసిన అనంతరం మధ్యాహ్నం సమయంలో రాష్ట్ర సివిల్ సెక్రటేరియట్‌లో పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన ఆదేశాన్ని ఇచ్చారని, తమ ప్రభుత్వం ప్రజానుకూల విధానాల కోసం పనిచేస్తుందని అన్నారు. ప్రజల జీవితాల అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేస్తారని తెలిపారు.
అంతకు మందు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ అహంకారంతో ఉండవద్దని మన్ విజ్ఞప్తి చేశారు. “మనకు ఓటు వేయని వారిని కూడా మనం గౌరవించాలి. మీ అందరికీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కి కృతజ్ఞతలు’’ అని ఆయన అన్నారు. భగత్ సింగ్ ను గుర్తు చేస్తూ ‘‘ ఇష్క్ కర్నా సబ్‌కా పైదైషీ హక్ హై క్యున్ నా ఈజ్ బార్ వతన్ కి సర్జామిన్ కో మెహబూబ్ బనా లియా జాయే ’’ అని తెలిపారు.
మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ 18 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ రెండు, శిరోమణి అకాలీ దాలి మూడు స్థానాల్లో విజయం సాధించాయి. ఈ సారి నిర్వహించిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులను కూడా ఓడించింది. ప్రస్తుత సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ(charanjith singh channi) రెండు స్థానాల నుంచి ఓడిపోయారు. అలాగే కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ (amarinder singh) కూడా ఓటమి పాలయ్యారు. అలాగే మరో సీనియర్ నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్ కూడా అపజయం పొందారు. ఈ ఎన్నికల్లో అకాలీదళ్-బహుజన్ సమాజ్ వాదీ పార్టీతో కలిసి పోటీ చేసింది. ఆ కానీ పొత్తు ప్రభావం చూపలేకపోయింది.
ప్రస్తుతం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన భగవంత్ మాన్ పంజాబ్ లోని ధురి ( Dhuri) స్థానం నుంచి 58,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఆయన ఇప్పటి వరకు ఆయన సంగ్రూర్ (Sangrur) లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు. ఈ సారి ఎమ్మెల్యేగా భారీ విజయం సాధించి, సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గత శనివారమే ఆయన తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
