Asianet News TeluguAsianet News Telugu

CM Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి.. అలా మార్చుతారేమో.. కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు 

CM Arvind Kejriwal:ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ కేంద్ర ప్రభుత్వంపై ఓ రేంజ్ లో మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి.. దేశ‌రాజ‌ధాని ఢిల్లీని పూర్తి స్థాయి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. 

CM Arvind Kejriwal Alleges That The Centre May Dissolve Delhi Assembly
Author
Hyderabad, First Published Jul 6, 2022, 3:17 AM IST

CM Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి.. దేశ‌రాజ‌ధాని ఢిల్లీని పూర్తి స్థాయి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం ఉందని కేజ్రీవాల్ సంచ‌ల‌న‌ ఆరోపించారు. వర్షాకాల సమావేశాల రెండో రోజున మున్సిపల్ ఎన్నికల జాప్యాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు వ్య‌తిరేఖ తీర్మాణాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఈ స‌మ‌యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అమితాబ్ బచ్చన్ సినిమా దీవార్ డైలాగ్‌ను చిత్ర శైలిలో చెప్పారు. మీకు ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ లాంటి ఏజెన్సీలు ఉంటే .. ఢిల్లీ ప్రజలకు  కొడుకు లా కేజ్రీవాల్ ఉన్నారని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల జాప్యం మండిపాటు

ఢిల్లీ అసెంబ్లీలో నేడు మున్సిపల్ ఎన్నికల జాప్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.  మున్సిపల్ ఎన్నికల జాప్యానికి బిజెపి పాలిత కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికలు నిర్వహించకుండా బీజేపీ తప్పించుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అసెంబ్లీలో బీజేపీపై విరుచుకుపడ్డారు. ఫండ్ కోసం ఏడుస్తూనే ఉన్నారని సీఎం కేజ్రీవాల్ అన్నారు. నిధులన్నీ ఇచ్చాం కానీ ఇప్పుడు ఎంసీడీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు వాటి నుంచి ఎందుకు నిధులు తీసుకోవడం లేదు. ఇప్పటికీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదన ప్ర‌శ్నించింది 

 ఈ సమయంలో, అమితాబ్ బచ్చన్ చిత్రం దీవార్ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. కేజ్రీవాల్ మాట్లాడారు. అమితాబ్ బచ్చన్ - దీవార్ చిత్రంలో అందులో..  అమితాబ్ బచ్చన్, నా దగ్గర డబ్బు ఉంది, సంపద బంగ్లా, మీ దగ్గర ఏమి ఉంది అని అన్నారు. అయితే దీనిపై శశికపూర్ మాట్లాడుతూ - నాకు తల్లి ఉంది. అలాగే ఈరోజు..త‌మ‌ ద‌గ్గ‌ర ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్, సీబీఐ ఉన్నాయని బీజేపీ వాళ్లు బెదిరిస్తున్నారు. కాబట్టి మాకు మా కొడుకు కేజ్రీవాల్ ఉన్నాడని ఢిల్లీ ప్రజలు అంటున్నారు. 

ఢిల్లీలో ఎప్పటికీ ఎన్నికలు ఉండవని అనిపిస్తోందని, అసెంబ్లీని రద్దు చేసి.. ఢిల్లీని పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాల‌ని బీజేపీ సన్నాహాలు చేస్తుంద‌ని అన్నారు. ఇది గూండాయిజం. కేజ్రీవాల్‌ను ద్వేషిస్తూనే, ఈ వ్యక్తులు దేశం మొత్తాన్ని ద్వేషించడం ప్రారంభించారని బీజేపీ పై విమ‌ర్శలు గుప్పించారు. రేపు మ‌న‌మేవ్వ‌రం ఉండ‌మ‌నీ, కానీ మ‌న‌ పిల్లలు మాత్రం.. ప్రజాస్వామ్యాన్ని దేశం నుంచి పారద్రోలాలి అంటూ దుర్భాషలాడారు. అత్యంత నిజాయితీపరుడైన సత్యేంద్ర జైన్‌ని అరెస్టు చేశారనీ, అతనిపై అవినీతిని నిరూపించలేనప్పుడు,  బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని అన్నారు. 
 
అదే సమయంలో, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనకు తాను మద్దతు ఇస్తున్నాను, కానీ వారు దానిని జరగనివ్వరు, మేము కోర్టుకు వెళ్లవలసి వస్తే అప్పుడు మేము వెళ్తాము అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.   దేశంలో ఢిల్లీని పూర్తి స్తాయి కేంద్ర పాలిత చేయాలని బీజేపీ భావిస్తుంద‌నీ.. అలా జరిగితే ఢిల్లీ ప్రజలు మౌనంగా కూర్చోరని అన్నారు. ఈ చర్యకు వ్యతిరేకంగా ఢిల్లీ వాసులు వీధుల్లోకి రానున్నారని వ్యాఖ్యానించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios