Asianet News TeluguAsianet News Telugu

ప్రియాంక గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం..

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి తృటితో ప్రమాదం తప్పింది. వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమంలో చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంక గాంధి వెడుతున్న టైంలో కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి గుద్దుకుంది. 

close shave for priyanka vadra as vehicles in her convoy collide with eath other on NH-24 - bsb
Author
Hyderabad, First Published Feb 4, 2021, 4:55 PM IST

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి తృటితో ప్రమాదం తప్పింది. వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమంలో చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంక గాంధి వెడుతున్న టైంలో కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి గుద్దుకుంది. 

అయితే ప్రమాదంలో ప్రియాంకతో పాటు మిగతావారికెవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తరువాత ప్రియాంక్ యథావిధిగా తన కార్యక్రమానికి వెళ్లారు. ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లా రాంపూర్ లో ఈ ఘటన జరిగింది. 

రిపబ్లిక్ డే నాడు చనిపోయిన రైతు నవరత్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ గురువారం యూపీలోని హాపూర్ జిల్లాకు బయల్దేరారు. ఉదయం ఢిల్లీ నుంచి రాంపూర్‌ చేరుకున్న ఆమె దిబ్దిబా గ్రామానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. 

ఈ ఘటనలో కాన్వాయ్ లోని మూడు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రియాంక ప్రయాణిస్తున్న కారు వైఫర్లు పనిచేయకపోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. వైపర్లు పని చేయక కారు అద్దంపై పేరుకున్న దుమ్ముతో రోడ్డు కనిపించక డ్రైవర్ కారు వేగం తగ్గించాడు.

దీంతో వెనక ఉన్న వాహనాలు ప్రియాంక వాహనాన్ని ఢీ కొట్టాయి. దీంతో ఆమె కాన్వాయ్ లోని మూడు కార్లు ధ్వంసమయ్యాయి.  ఆ తరువాత కారు అద్దాలను స్వయంగా ప్రియాంక శుభ్రం చేసుకుని కొద్ది సేపటి తర్వాత దిబ్దిబా గ్రామానికి వెళ్లారు.  ఆమె వెంట ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios