ముస్లిం మహిళలు బ్యూటీ పార్లర్లకు వెళ్లకూడదు... యూపీ మతపెద్ద వింత వ్యాఖ్య
మహిళలు పురుషులు పనిచేసే బ్యూటీ పార్లర్‌లకు వెళ్లడం, మేకప్‌లు చేసుకోవడం 'నిషిద్ధం', 'చట్టవిరుద్ధం' అని వ్యాఖ్యానించాడో ముస్లిం మతగురువు.
ఉత్తరప్రదేశ్ : "ముస్లిం మహిళలు పురుషులు పనిచేసే బ్యూటీ పార్లర్లకు వెళ్లకూడదు.. అలా వెళ్లడం 'నిషిద్ధం', 'చట్టవిరుద్ధం' అని అని ఉత్తరప్రదేశ్‌లోని ఒక మతగురువు అన్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో ఒక మతపెద్ద శుక్రవారం మాట్లాడుతూ.. ముస్లిం మహిళలు పురుషులు పనిచేసే బ్యూటీ పార్లర్‌లకు వెళ్లకూడదని అన్నారు. అలాంటి పార్లర్‌లలో మహిళలు తమ మేకప్‌లు చేసుకోవడం 'నిషిద్ధం', 'చట్టవిరుద్ధం' అని ఆయన పేర్కొన్నారు.
ముఫ్తీ అసద్ కస్మీ అనే మతగురువు ఈ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు, ముస్లిం మహిళలు పురుషులు పనిచేసే బ్యూటీ పార్లర్‌లను సందర్శించడం మానుకోవాలని, బదులుగా మహిళలు మాత్రమే పనిచేసే సెలూన్‌లకు వెళ్లాలని సూచించారు.
డీప్‌ఫేక్ : ఆందోళనకర అంశం, చాట్‌జిపిటి వార్నింగ్ ఇవ్వాలి.. ప్రధాని మోడీ
ఇలాంటి ఓ విచిత్రమైన ఘటన గత నెలలో కాన్పూర్ లో వెలుగు చూసింది. ఓ మహిళ ఐబ్రోస్ చేయించుకుందని.. సౌదీ అరేబియాలో ఉన్న ఆమె భర్త ఆమెకు ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త వీడియో కాల్ లో మాట్లాడుతున్న సమయంలో తాను కొత్తగా చేయించుకున్న ఐబ్రోస్ ను గమనించాడని గుల్సైబా అనే ఆ మహిళ చెప్పింది. దాని గురించి ప్రశ్నించాడు. కనుబొమ్మలు బాగా పెరిగి గలీజ్ గా కనిపిస్తున్నాయని..అందుకే షేప్ చేపించానని ఆమె చెప్పింది. వెంటనే కోపానికి వచ్చిన ఆమె భర్త వీడియో కాల్‌లో మూడుసార్లు తలాక్ చెప్పాడు.