సినిమాలు, టీవీ షోల ప్రభావం జనాల మీద భారీగానే ఉంటుందనే సంగతి తెలిసిందే. తాజాగా 5వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఆత్మహత్య (girl committed suicide) చేసుకోగా.. ఆ పద్దతిని ఓ టీవీ సీరియల్ (TV seria) నుంచి నేర్చుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. 

సినిమాలు, టీవీ షోల ప్రభావం జనాల మీద భారీగానే ఉంటుందనే సంగతి తెలిసిందే. తాజాగా 5వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఆత్మహత్య (girl committed suicide) చేసుకోగా.. ఆ పద్దతిని ఓ టీవీ సీరియల్ (TV seria) నుంచి నేర్చుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై మాత్రం స్పష్టం చేశారు. వివరాలు.. ఆత్మహత్య చేసుకన్న బాలికకు క్రైమ్ పెట్రోల్ సీరియల్ చూడటం చాలా ఇష్టం. ఆదివారం బాలిక తల్లిదండ్రులు మతపరమైన కార్యక్రమంలో భాగంగా భోజనం చేసేందుకు వెళ్లారు. 

ఆ సమయంలో ఇంట్లో బాధిత బాలిక, ఆమె అక్క(14) ఉన్నారు. బాలిక అక్క కింద గదిలో ఉండగా.. బాలిక మాత్రం పైన గదిలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో బాలిక ఆ రూమ్‌లో ఉన్న ఫ్యాన్‌కు దుప్పట్ట కట్టి ఉరివేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు ఎంతసేపు తలుపు తట్టిన బాలిక తలుపులు తెరవలేదు. దీంతో అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు.. కిటికీలోంచి చూడగా అప్పటికే ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. దీని షాక్ తిన్న బాలిక తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు.. తలుపులు పగులగొట్టి గదిలోపలికి ప్రవేశించారు. బాలికను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాలిక చనిపోయినట్టుగా వైద్యులు నిర్దారించారు.

Also read: ఇష్టం లేకున్నా శృంగారానికి యత్నం: పురుషాంగం కోసిన భార్య

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఫ్యాన్‌కు ఉరివేసుకోవడానికి ముందు కూడా ఉరివేసుకోవడానికి అదే గదిలో వేరే చోట స్కార్ఫ్‌ కట్టింది. అయితే ఆ ప్రయత్నం విఫలం కావడంతో బాలిక ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో బాలిక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

ఈ ఘటనకు సంబంధించి బాలిక బంధువు ఒకరు మాట్లాడుతూ.. బాలికకు క్రైమ్ పెట్రోల్, సావధాన్ ఇండియా వంటి నేరాలకు సంబంధించిన టీవీ సీరియల్స్ చూసే అలవాటు ఉందని చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడం సీరియల్స్ నుంచే నేర్చుకుందని భావిస్తున్నట్టుగా తెలిపారు. ఇక, బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై మాత్రం స్పష్టత రాలేదు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.