విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియోను వైరల్ చేస్తానని బెదిరించి.. బాధితురాలిపై టీచర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంలొ జార్ఖండ్‌లో వెలుగులోకి వచ్చింది.
దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్నో కఠిన తరమైన చట్టాలను రూపొందించి అమలు చేస్తున్న ఫలితం లేకుండా పోతుంది. కామాంధులు ఆ చట్టాలను ఏమాత్రం లెక్కచేయకుండా మృగాల రెచ్చిపోతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
తాజాగా విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియోను వైరల్ చేస్తానని బెదిరించి.. బాధితురాలిపై టీచర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంలొ జార్ఖండ్‌లోని రాంచీలో వెలుగులోకి వచ్చింది.
జార్ఖండ్‌లోని రాంచీలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని మీద అదే పాఠశాలలో పనిచేసున్న ఉపాధ్యాయుడు కన్నేశాడు. ఆ చిన్నారికి మాయ మాటాలు చెప్పి.. ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆ దారుణాన్ని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోను వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడి.. ఆ చిన్నారిపై ఆ కీచక టీచర్ పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు వెల్లబుచ్చడంతో అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. తనపై సమీద్ కశ్యప్ అనే కీచక ఉపాధ్యాయుడు చేసిన దారుణాన్ని వెల్లడించింది. తనపై అత్యాచారం చేసి.. ఆ దారుణాన్ని చిత్రీకరించి, వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడనీ, తనని బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి స్కూల్‌లో ఫిర్యాదు చేయగా, ఉపాధ్యాయుడు బాధితురాలిపై శారీరకంగా దాడికి పాల్పడ్డాడని తెలిపింది. బాధితురాలిని ఇంటికి పిలిపించి లైంగికంగా వేధించేవాడనీ, విషయం బయటకు పొక్కడంతో రాజీకి ఒప్పుకోవాలని బాధితురాలిని బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ దారుణంపై జులై 29న ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కానీ, బాధితురాలి తల్లి పాఠశాలకు ఇచ్చిన ఫిర్యాదులో ఎఫ్‌ఐఆర్ కాపీకి తేడా ఉండడంతో ఈ దారుణాన్ని తక్కువ చేసి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో బాధితురాలు తల్లి .. ఆ కీచక ఉపాధ్యాయుడిపై IPC సెక్షన్లు 354,323 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈదాడిని జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షాదేవ్ ఖండిస్తూ.. ఐపీసీలోని తగిన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయలేదని విమర్శించారు. నిందితుడైన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు లైటర్ సెక్షన్లను వర్తింపజేయడం ద్వారా తీవ్రమైన విషయాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. తదుపరి విచారణ జరుగుతోంది.
