Asianet News TeluguAsianet News Telugu

ఆ చనిపోయిన కుర్రాడికి... 100శాతం మార్కులు

ఇటీవల సీబీఎస్ఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫరీక్షా ఫలితాల్లో... అత్యంత ప్రతిభ కనిపించిన విద్యార్థుల అందరి ఇళ్లల్లో ఆనందం వెల్లి విరిసి ఉంటుంది. కానీ... ఓ విద్యార్థి ఇంట మాత్రం కన్నీళ్లే మిగిలాయి. 

Class 10 CBSE Student Of Noida Who Died In March Scores 100 In English
Author
Hyderabad, First Published May 8, 2019, 12:54 PM IST

ఇటీవల సీబీఎస్ఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫరీక్షా ఫలితాల్లో... అత్యంత ప్రతిభ కనిపించిన విద్యార్థుల అందరి ఇళ్లల్లో ఆనందం వెల్లి విరిసి ఉంటుంది. కానీ... ఓ విద్యార్థి ఇంట మాత్రం కన్నీళ్లే మిగిలాయి. ఆ విద్యార్థి రాసిన మూడు పరీక్షల్లో 90శాతానికి పైగా మార్కులు. ఒక సబ్జెక్ట్ లో అయితే.. ఏకంగా 100 మార్కులు. కానీ... ఆనందించడానికి ఆ విద్యార్థి లేడు.

నోయిడాకి చెందిన వినాయక్ శ్రీధర్ కి రెండేళ్ల వయసు నుంచి జన్యుసంబంధిత (మస్కులర్ డిస్ట్రోఫీ) వ్యాధితో బాధపడుతున్నాడు. సీబీఎస్ఈ పరీక్షల్లో ఆ విద్యార్థి మూడు పరీక్షలు రాయగా... ఆ మూడింటిలోనూ అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు.

ఈ విద్యార్థికి ఇంగ్లీషులో వందకు వంద, సైన్స్‌లో 96, సంస్కృతంలో 97 చొప్పున మార్కులు రాగా, కంప్యూటర్ సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు రాయకుండానే చనిపోయాడు. ఆ విద్యార్థి రాసిన మూడు పరీక్షల్లో దాదాపు వంద మార్కులు సాధించడం గమనార్హం.

నోయిడాలోని అమిటీ ఇంటర్నేషనల్ పాఠశాలకు చెందిన ఈ విద్యార్థి పరీక్షలను కూడా చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడీ కేటగిరీ కింద పరీక్షలు రాయకుండా సాధారణ కేటగిరీలోనే పరీక్షలు రాశారు.

దీనిపై బాధితుని తల్లి మమతా శ్రీధర్ మాట్లాడుతూ, తన కుమారుడు కుర్చీకే పరిమితమైనప్పటికీ.. అతని జ్ఞాపకశక్తి మాత్రం అపారమన్నారు. అందుకే పరీక్షలను కూడా స్వయంగా తనే రాశాడని చెప్పాడు. ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫిన్ హాకింగ్స్ మాదిరిగానే తన కుమారుడు కూడా తన పనులు తానే చేసుకునేవాడనీ, అతడు వ్యోమగామి కావాలని పరితపించేవాడనీ కళ్ల వెంట నీళ్లు పెట్టుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios