Asianet News TeluguAsianet News Telugu

ఆ ప్రచారం ఫేక్.. సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల విద్యార్థులకు బోర్డు కీలక సూచన..

పదో తరగతి, 12వ తరగతి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) కీలక సూచనలు చేసింది. 

Class 10 12 exam date sheets on social media fake says CBSE
Author
First Published Dec 11, 2022, 4:17 PM IST

పదో తరగతి, 12వ తరగతి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) కీలక సూచనలు చేసింది. 10, 12 తరగతుల పరీక్ష తేదీల జాబితాకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం నకిలీదని పేర్కొంది. అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. పరీక్ష తేదీలను బోర్డు ఇంకా ప్రకటించలేదని పేర్కొంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన ఉంటుందని తెలిపింది. 

‘‘పరీక్షలకు సంబంధించి పలు రకాల తేదీలు నకిలీవి. పరీక్షల షెడ్యూల్ త్వరలో ప్రకటించబడుతుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారిక సమాచారం కోసం వేచి ఉండాలి’’అని సీబీఎస్‌ఈ బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇక, ఈ విద్యా సంవత్సరానికి గానూ 2023 ఫిబ్రవరి 15 నుంచి 10, 12 తరగతులకు థియరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.  

‘‘జనవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయని.. అప్పటి వరకు సిలబస్‌ను పూర్తి చేయాలని పాఠశాలలను ఆదేశించడం జరిగింది. 12వ తరగతికి సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలను బోర్డు నియమించిన ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్లు మాత్రమే నిర్వహిస్తారని,  10వ తరగతికి మాత్రం ఇటర్నల్ ఎగ్జామినర్లు నిర్వహిస్తారు’’ అని అధికారి తెలిపారు. ఇక, అన్ని సబ్జెక్టులకు మార్కింగ్ స్కీమ్‌లతో పాటు సబ్జెక్ట్ వారీగా సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి శాంపిల్ పేపర్లను కూడా బోర్డు విడుదల చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios