అస్సాం రాష్ట్రంలోని తిన్‌సుకియా జిల్లాలో భద్రతా బలగాలు, ఉల్ఫా-ఐ ఉగ్రవాదులకు మధ్య బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పౌరుడికి గాయాలు అయ్యాయి. 

అస్సాంలో ఎన్ కౌంటర్ జరిగింది. తిన్‌సుకియా జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు, ఉల్ఫా-ఐతో సంబంధం ఉన్నఅనుమానిత ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే ఆల్ఫా-ఐ మిలిటెంట్లు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఓ పౌరుడికి గాయాలు అయ్యాయి.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు అల్ ఖైదాతో లింకులు - ఎన్ఐఏ

దీంతో ఆ ప్రాంతాన్ని మొత్తం భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ ఎన్ కౌంటర్ ను గౌహతి డిఫెన్స్ పీఆర్వో ధృవీకరించారని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. ఎగువ అస్సాం జిల్లాలోని పెంగేరి-దిగ్‌బోయ్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది.

Scroll to load tweet…

ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది...