మధ్యప్రదేశ్‌లో ఓ భార్య.. తరుచూ పనికి వెళ్లాలని భర్తపై ఒత్తిడి తెచ్చింది. ఈ విషయమై వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం, ఆ భర్త.. భార్యను చంపేశాడు.
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దుర్ఘటన జరిగింది. పనికి వెళ్లమని పదే పదే చెప్పడమే ఆమె చేసిన తప్పుడు. కట్టుకున్న భర్తే కాలయముడు అయ్యాడు. పనికి వెళ్లమని పోరు పెడతావా అంటూ హతమార్చాడు. పదే పదే చెబుతుండటంతో ఆ భర్త రెండు కత్తెరలు తీసుకుని భార్యను పొడిచి చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటుచేసుకుంది.
జబల్‌పూర్‌కు చెందిన విభోర్ సాహు, రీతు భార్య భర్తలు. విభోర్ సాహు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కానీ, 15 రోజుల నుంచి ఆ డ్రైవింగ్ పనికి వెళ్లడం లేదు. దీంతో తన భర్త పనికి వెళ్లడం లేదని భార్య భావించింది. అదే విషయాన్ని ఆయనకు పదే పదే గుర్తు చేసింది. ఓ రోజు ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. తీవ్ర వివాదం రేగింది. అనంతరం, అదే కోపంతో విబోర్ సాహు.. రీతును చంపేశాడు. రెండు కత్తెరలతో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ సమయంలో ఇంట్లో ఇతరులెవరూ లేరు. ఓ మతపరమైన వేడుక కోసం విభోర్ తల్లి, సోదరుడు బయటకు వెళ్లారు. వారు తిరిగి వచ్చే లోపు ఈ దారుణం జరిగిపోయింది. ఇంటికి తిరిగి రాగానే రక్తపు మడుగులు రీతు మృతదేహం కనిపించింది.
విభోర్ సాహు ఒక డ్రైవర్ అని, 15 రోజులుగా ఆయన పనికి వెళ్లడం లేదని తమ ప్రాథమిక విచారణలో తేలిందని రాంఝీ పోలీసు స్టేషన్ ఇంచార్జీ సాహదేశ్ రాము సాహు వివరించారు. ఈ ధోరణి చూసి పనికి వెళ్లాలని భార్య... భర్తపై తరుచూ ఒత్తిడి తెచ్చిందని, ఆ తర్వాత ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని వివరించారు.
రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతీ యువకుడు కలిసి కదులుతున్న రైలు కింద దూకారు. దీంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. వారి శరీర భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. అయితే ఇందులో యువకుడికి 25 సంవత్సరాల ఉండగా.. యువతికి 17 సంవత్సరాలు ఉంటాయి. వీరిద్దరి ప్రేమికులు అయి ఉంటారని, ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
బుండి జిల్లా లఖేరి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల రెండో వారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చనిపోయిన యువకుడిని కమల్ జంగిద్ అలియాస్ కంకుగా పోలీసులు గుర్తించారు. అతడు లఖేరి పట్టణంలోని మలియోన్ కా మొహల్లా కు చెందిన వాడు. మృతురాలు మైనర్ కూడా అదే ప్రాంతానికి చెందినదని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
