ఢిల్లోని Vigyan Bhawanలో హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సంయుక్త సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సదస్సులో పాల్గొన్న జస్టిస్ ఎన్వీ రమణ  మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ  విధిని నిర్వర్తించే సమయంలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలని అన్నారు.

దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. శనివారం ఢిల్లోని Vigyan Bhawanలో హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సంయుక్త సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సదస్సులో పాల్గొన్న జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ విధిని నిర్వర్తించే సమయంలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలని అన్నారు. చట్టానికి అనుగుణంగా ఉంటే పాలనలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదని చెప్పారు.

‘‘రాజ్యాంగం మూడు వ్యవస్థల మధ్య అధికార విభజనను అందిస్తుంది. మూడు వ్యవస్థల మధ్య సామరస్యపూర్వక పనితీరు ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది. మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు.. మనం లక్ష్మణరేఖను గుర్తుంచుకోవాలి" అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు.. ఇప్పుడు వ్యక్తిగత ఆసక్తి వ్యాజ్యంగా మారాయని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగపయోగించుకోవడం బాధకరమన్నారు.

కేసులను త్వరితగతితన పరిష్కరించడానికి కోర్టుల్లో మరింత సిబ్బంది కావాలని సీజేఐ అన్నారు. అందరి విషయంలో చట్టం సమానంగా ఉంటుందన్నారు. బాధితులకు న్యాయం అందించడంలో చట్టం అమలు అనేది అతర్భాగమని చెప్పారు. న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని తెలిపారు. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందేనని చెప్పారు. వార్డు మెంబర్ నుంచి లోక్ సభ సభ్యుడి వరకు అందరిని గౌరవించాలని తెలిపారు. అయితే కోర్టుల ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలను పట్టించుకోకపోవడంతో ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. న్యాయపరమైన తీర్పులు వచ్చినప్పటికీ ప్రభుత్వ ఉద్దేశకపూర్వక చర్యలు ప్రజాస్వామ్యానికి అంత ఆరోగ్యకరమైనది కాదని అన్నారు. 

కోర్టుల్లో మానవ వనరుల కొరత తీరితే కేసుల భారం తగ్గుతుందన్నారు. న్యాయవ్యవస్థలోని ఖాళీలను ఎప్పటికప్పుడూ భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏడాది కాలంగా జడ్జిల నియామకాల్లో ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని చెప్పారు. దేశంలో 10 లక్షల మంది జనాభాకు 20 మంది న్యాయమూర్తులే ఉన్నారని అన్నారు. కింది స్థాయి కోర్టుల్లో మాతృభాషలోనే తీర్పులు వెలువరించాల్సిన అవసరముందన్నారు. సీఎంలు, హైకోర్టు సీజేలు పరస్పర సహకారంతో పనిచేయాలన్నారు.