Asianet News TeluguAsianet News Telugu

అధికార పార్టీ అండతో అక్రమాలు.. అలాంటి పోలీసులకు రక్షణ కల్పించలేం: సీజేఐ సంచలన వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీల అండ చూసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడే పోలీసులకు, అధికారులకు న్యాయవ్యవస్థ రక్షణ కల్పించలేదని స్పష్టం చేశారు.

cji justice nv ramana interesting comments on govt officials
Author
New Delhi, First Published Oct 1, 2021, 5:27 PM IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీల అండ చూసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడే పోలీసులకు, అధికారులకు న్యాయవ్యవస్థ రక్షణ కల్పించలేదని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ఏడీజీపీ గుర్జిందర్ పాల్ కేసు విచారణ సందర్భంగా శుక్రవారం జస్టిస్ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీల అండతో వసూళ్లకు పాల్పడే అధికారులు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఆయన హెచ్చరించారు. ఆ సమయంలోనే సదరు అధికారులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించడం పరిపాటిగా మారిందని సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. 

అంతేకాకుండా, అధికారులు హద్దులు మీరడం, పోలీసుల అతి ప్రవర్తనపై అందే ఫిర్యాదుల పరిష్కారానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలో స్థాయి సంఘం ఏర్పాటుకు యోచిస్తున్నట్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ప్రస్తుతానికి స్థాయి సంఘం ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ చేయడంలేదని ఆయన వెల్లడించారు. భవిష్యత్ లో మాత్రం పరిగణనలోకి తీసుకుంటామని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios