మధ్యప్రదేశ్‌లో సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతున్న ఓ యువకుడు కోచింగ్ సెంటర్‌లో క్లాసు వింటూనే కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి అభ్యర్థులు సమీప హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, అప్పటికే రాజు లోధి మరణించినట్టు వైద్యులు తెలిపారు. 

Viral: ఈ మధ్య కాలంలో సైలెంట్ హార్ట్ ఎటాక్ ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. మనిషి చూస్తుండగానే కుప్పకూలిపోయి క్షణాల్లోనే ప్రాణాలు విడిచిపెడుతున్నారు. చుట్టుపక్కల వారు నిస్సహాయులను చేస్తున్న ఈ ఘటనలు అందరిలోనూ కలవరం పుట్టిస్తున్నాయి. ఇలాంటి ఓ ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడు కోచింగ్ క్లాస్‌లో పాఠాలు వింటూనే కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. వెంటనే సమీప హాస్పిటల్ తరలించారు. కానీ, అప్పటికే ఆ విద్యార్థి మరణించినట్టు వైద్యులు నిర్దారించారు.

సాగర్ జిల్లాకు చెందిన రాజా లోధి మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇండోర్‌లో కోచింగ్ క్లాసులకు వెళ్లుతున్నాడు. క్లాసు శ్రద్ధగా వింటున్నాడు. ఇంతలో చెస్ట్ పెయిన్ వచ్చింది. ఈ నొప్పితో గింజుకుంటూనే కుప్పకూలిపోయాడు. డెస్క్ పై నుంచి క్షణాల్లోనే కిందపడిపోయాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది.

Scroll to load tweet…

Also Read : NTR: వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా.. : జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదంపై కొడాలి నాని

రాజు లోధితో కలిసి చదువుకుంటున్న ఆయన మిత్రుడు మాట్లాడుతూ.. లోధికి నొప్పి వస్తున్నదని ఇబ్బంది పడ్డాడని వివరించారు. అయితే, ఆ తర్వాత నొప్పి తీవ్రత పెరిగింది. దీంతో ఆయన కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే రాజు లోధిని సమీప హాస్పిటల్ తరలించారు. కానీ, అప్పటికే రాజు లోధి మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతున్నది.