భర్త అసహజ శృంగారం చేయమని ఒత్తిడి చేశాడని.. భార్య రేప్ కేసు పెట్టింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... పూణే నగరంలోని ప్రభాత్ రోడ్డు ప్రాంతానికి చెందిన డాక్టర్ తో 2016లో వివాహం జరిగింది.

వివాహం అయినప్పటి నుంచి తనను భర్త అసహజ శృంగారం చేయమని ఒత్తిడి తీసుకువచ్చాడని భార్య పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. తనను అత్తవారిల్లయిన పూణేతోపాటు ఇండోనేషియా దేశ హనీమూన్ పర్యటనలోనూ అసహజ శృంగారం చేయమని భర్త వేధించాడని భార్య వెల్లడించింది. 

తనతో అసహజ శృంగారానికి అంగీకరించకుంటే విడాకులు ఇస్తానని తన భర్త వేధించాడని, దీంతోపాటు తన అత్తమామలు కూడా తనను వేధించారని కోడలు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేర బుల్దానా పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 377, 328,342, 498 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడైన డాక్టరును అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.