స్క్రీనింగ్ సమయంలో  ఎలుక కరిచిన మహిళకు నష్టపరిహారం చెల్లించాలని సినిమా హాల్ యజమానికి అసోంలోని వినియోగదారుల కోర్టు తాజాగా ఆదేశించింది. 

ఐదేళ్ల క్రితం సినిమా చూస్తుండగా ఎలుక కాటుకు గురై మహిళకు పరిహారం చెల్లించాలని గౌహతిలోని ఓ సినిమా హాల్ యాజమాన్యాన్ని కన్స్యూమర్ కోర్ట్ ఆదేశించింది. ఆమె కేసును పరిష్కరిస్తూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ ఏప్రిల్ 25న బాధిత మహిళకు వైద్య ఖర్చులు, నొప్పి ,మానసిక వేదనకు పరిహారంగా మొత్తం ₹67,282.48 చెల్లించాలని గౌహతిలోని గలేరియా సినిమా యాజమాన్యాన్ని ఆదేశించింది.

సినిమా హాల్ లో సినిమా చూస్తుండగా ఎలుక కోరకడంతో పాటు యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా సినిమా హాల్ నిర్వాహకులకు వ్యతిరేకంగా బాధిత మహిళ వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించింది. ఆమె కేసును 2019 మార్చిలో అంగీకరించారు. ఈ వివాదాన్ని కామ్రూప్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ చైర్మన్ AFA బోరా, సభ్యులు అర్చన దేకా లఖర్, టుటుమోని దేవా గోస్వామిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సినిమా హాల్ పరిశుభ్రతను నిర్వహించడం యజమాని యొక్క విధి అని కోర్టు పేర్కొంది. 

సమాచారం ప్రకారం.. సినిమా హాలు శుభ్రంగా లేదని, పాప్‌కార్న్ , ఇతర తినుబండారాలు నేలపై పడి ఉన్నాయని, దాని వల్ల ఎలుకలు తిరుగుతున్నాయని వాంగ్మూలంలో ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. అలాగే.. ప్రతి షో తర్వాత సినిమా హాలును క్రమం తప్పకుండా తుడిచివేయడం లేదని, సినిమా హాల్ భద్రత, పారిశుద్ధ్య పరిస్థితిని నిర్ధారించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది.

అసలేం జరిగిందంటే..? 

ఈ సంఘటన 2018 అక్టోబర్ 20న గౌహతిలోని భంగాఘర్‌లోని గలేరియా సినిమా హల్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన ఐదు నెలల తర్వాత బాధితురాలు వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించింది. రాత్రి 9 గంటల షో చూడటానికి తన కుటుంబంతో కలిసి వెళ్లానని, ఇంటర్వెల్ తర్వాత తన పాదాన్ని ఏదో కొరికినట్లు అనిపించిందని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. పాదాల నుంచి రక్తం కరడంతో తన స్నేహితుల సహయంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లననీ, సినిమా హాల్ సిబ్బంది సహాయం చేయడానికి ముందుకు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 

ఏం కరిచిందో తెలియకపోవడంతో రెండు గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. అనంతరం పాము కాటు కాదనీ, ఎలుక కరిచిందని వైద్యులు ధృవీకరించారు ఆమెకు యాంటీ రేబిస్ , ఇతర మందులు ఇచ్చారు. సినిమా హాల్ అధికారులు ప్రథమ చికిత్స లేదా మరేదైనా సహాయం అందించడానికి నిరాకరించడంతో ఆమె వెంటనే హాల్ నుండి నిష్క్రమించి సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. " అని అనితా వర్మ ఫిర్యాదుదారు యొక్క న్యాయవాది పేర్కోంది. ఈ ఘటన తరువాత తాను అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొంది.

ఈ విషయమై సినిమా హాల్ యజమాని వద్దకు వెళ్లగా.. వారు తన తదుపరి చిత్రానికి ఉచితంగా టిక్కెట్లు ఇచ్చామని చెప్పారని, తన అభ్యర్థనను తిరస్కరించారని ఆ మహిళ చెప్పింది. వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌తో పాటు, ఆమె మానసిక వేదన, నొప్పి , బాధలకు పరిహారంగా సినిమా హాల్ యజమానిని రూ.6 లక్షల పరిహారం కోరింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన సినిమా హాల్ యాజమాన్యం ఫిర్యాదు యోగ్యమైనది కాదని, ఆ సమయంలో మహిళకు చికిత్స అందిమని వాదించారు.

కామ్రూప్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ చైర్మన్ AFA బోరా, సభ్యులు అర్చన దేకా లఖర్, టుటుమోని దేవా గోస్వామిలతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ.. సినిమా హాల్ పరిశుభ్రతను నిర్వహించడం యజమాని యొక్క విధి. ఈ ఘటనలో సినిమా హాలు నిర్లక్ష్యమే కారణమని కోర్టు పేర్కొంది. అలాగే 45 రోజుల్లోగా రూ.67,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 45 రోజుల తర్వాత చెల్లింపు చేస్తే.. ఆ మొత్తాన్ని చెల్లించే వరకు సంవత్సరానికి 12 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.