న్యూఢిల్లీ: తెలుగు సినీ నటి జయప్రద మంగళవారం నాడు బీజేపీలో చేరారు.  యూపీలోని రాంపూర్‌ నుండి ఆమె బీజేపీ అభ్యర్ధిగా  బరిలోకి దిగనున్నారు.

గతంలో ఇదే పార్లమెంట్ స్థానం నుండి ఆమె సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధిగా  ప్రాతినిథ్యం వహించారు. సమాజ్ వాదీ పార్టీ సంక్షోభం సమయంలో  ములాయం  వైపు జయప్రద నిలిచారు. 

అమర్‌సింగ్‌తో పాటు ములాయం పై కూడ ఆ సమయంలో అఖిలేష్ యాదవ్  సస్పన్షన్ వేటు వేయడంతో జయప్రద తెలుగు రాజకీయాలపై ఆసక్తిని కనబర్చారు.ఏపీలోని వైసీపీ, టీడీపీ లనుండి  పోటీ చేయాలని భావించినట్టుగా ప్రచారం సాగింది. మంగళవారం నాడు ఆమె న్యూఢిల్లీలో బీజేపీలో చేరారు.