Tamil Nadu Goddess Parvati Idol: తమిళనాడులో 50 ఏళ్ల క్రితం చోరీకి గురైన చోళుల కాలం నాటి పురాతన పార్వతి దేవి విగ్రహం న్యూయార్క్‌లో ఉన్నట్లు ఐడల్‌ వింగ్‌ క్రిమినల్‌ ఇన్విస్టేగేషన్‌ డిపార్ట్‌మెంట్‌(సీఐడీ) పేర్కొంది. న్యూయార్క్‌లోని బోన్‌హామ్స్‌ వేలం హౌస్‌లో ఈ విగ్రహాన్ని గుర్తించినట్లు సీఐడీ తెలిపింది.  

Tamil Nadu Goddess Parvati Idol: తమిళనాడులో 50 ఏళ్ల క్రితం చోరీకి గురైన చోళుల కాలం నాటి పురాతన పార్వతి దేవి విగ్రహం అమెరికాలోని న్యూయార్క్‌లో లభ్యమైంది. ఈ విగ్రహం 50 సంవ‌త్స‌రాల‌ క్రితం కుంభకోణం నగరంలోని తండతోట్టంలోని నందనపురీశ్వర శివన్ ఆలయంలో దొంగిలించబడింది. ప్ర‌స్తుతం ఈ విగ్ర‌హం న్యూయార్క్‌లోని బోన్‌హామ్స్ వేలం హౌస్‌లో ఈ విగ్రహం లభ్యమైనట్లు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) తెలిపింది. 

విగ్రహం చోరీపై తొలుత‌ 1971లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి ఫ‌లితం లేదు. సుధీర్ఘ కాలం త‌రువాత‌ 2019లో కె. వాసు అనే స్థానికుడు ఈ విష‌యంపై ఫిర్యాదు చేసి.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలీసులు కొన్ని రోజుల పాటు విచార‌ణ చేప‌ట్టినా .. కేసులో ఎలాంటి పురోగ‌తి లేక‌పోవ‌డంతో కేసును పెండింగ్‌లో పెట్టారు.

అయితే.. తాజాగా ఐడల్ వింగ్ ఇన్‌స్పెక్టర్ గా ఎం. చిత్ర వ‌చ్చాక‌.. ఈ కేసులో విచారణ తిరిగి ప్రారంభ‌మైంది.. ఇది మళ్లీ CID దృష్టికి వచ్చింది. విదేశాల్లో వేలం హౌస్‌లు, మ్యూజియంలలో చోళుల కాలం నాటి పార్వతి విగ్రహాలపై సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. ప్రపంచంలోని వివిధ మ్యూజియంల నుండి సమాచారం సేక‌రించి.. ప‌రిశీలించారు. ఈ క్ర‌మంలో 50 సంవత్సరాల క్రితం దొంగిలించబడిన పార్వతీ దేవి విగ్రహం బొన్‌హామ్సో వేలం హౌస్‌లో ఉన్న‌ట్టు గుర్తించారు. 

పార్వతీ దేవి విగ్రహం గురించిన సమాచారం

ఇది సుమారు 12వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి విగ్రహం. ఈ విగ్రహం ఎత్తు 52 సెం.మీటర్లు ఉంటుంది. ఈ విగ్రహం విలువ అంత‌ర్జాతీయ మార్కెట్ ల్లో సుమారు ఒకటిన్నర కోట్లు పలుకుతోంద‌ని అధికారులు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో సాధారణంగా దేవత మూర్తులు నిలబడి ఉన్న స్థితిలో ఉంటాయి. ఈ విగ్ర‌హంలో కిరీటం ధరించి ఉండ‌టం కనిపిస్తుంది. అలాగే విగ్ర‌హం నెక్లెస్‌లు, ఆర్మ్‌బ్యాండ్‌లు, వస్త్రాలతో రూపొందించి ఉంది. ఐడల్ వింగ్ సిఐడి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) జయంత్ మురళి ప్రకారం.. కుంభకోణంలో తందంతోట్టంలోని నదనపురీశ్వరార్ శివన్ ఆలయంలో అదృశ్యమైన పార్వతి దేవి విగ్ర‌హాన్ని తీసుకరావ‌డానికి సంబంధిత పత్రాలను సిద్ధం చేస్తున్న‌ట్టు తెలిపారు. 

Scroll to load tweet…