హిజ్రా వేషంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిరసన

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 10, Aug 2018, 12:56 PM IST
Chittoor MP Siva prasad variety protest in front of parliament
Highlights


న్యూఢిల్లీ:  ఏపీ విభజన హమీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ  టీడీపీ ఎంపీలు గురువారం నాడు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. 


న్యూఢిల్లీ:  ఏపీ విభజన హమీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ  టీడీపీ ఎంపీలు గురువారం నాడు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి ప్రతి రోజూ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టం అమలు చేయాలనే డిమాండ్‌తో టీడీపీ ఎంపీలు ఆందోలన నిర్వహిస్తున్నారు.  ఇవాళ  చిత్తూరు ఎంపీ శివప్రసాద్ హిజ్రా వేషధారణలో  ఆందోళన నిర్వహించారు.

 ఏపీకి ఇచ్చిన హమీలను నేరవేర్చాలని టీడీపీ ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శించారు.  ఎన్ని రకాల వేషధారణలతో ఆందోళనలు నిర్వహించినా మోడీ మనసు కరగడం లేదన్నారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. మోడీ మనసు కరగాలనే ఉద్దేశ్యంతోనే ట్రాన్స్ జెండర్ వేషం వేయాల్సి వచ్చిందని చిత్తూరు ఎంపీ శివప్రసాద్  చెప్పారు. 

ఎన్నికల సమయంలో  ఏపీకి  ప్రత్యేక హోదాను అమలు చేస్తామని ఇచ్చిన హమీని ఆయన గుర్తు చేశారు.  తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.  ఇదిలా ఉంటే ప్రతిరోజూ వినూత్నంగా వేషధారణలతో  నిరసన వ్యక్తం చేస్తున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అభినందించారు.

loader