Chitradurga: ఆగివున్న ట్రక్కును కారు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘోర ప్ర‌మాదం కర్నాట‌క‌లోని చిత్రదుర్గ జిల్లాలో చోటుచేసుకుంది. ఆగివున్న‌ ట్రక్కును కారు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డార‌ని సంబంధిత అధికారులు తెలిపారు.  

Chitradurga Road Accident: ఆగివున్న ట్రక్కును కారు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘోర ప్ర‌మాదం కర్నాట‌క‌లోని చిత్రదుర్గ జిల్లాలో చోటుచేసుకుంది. ఆగివున్న‌ ట్రక్కును కారు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డార‌ని సంబంధిత అధికారులు తెలిపారు. 

ఈ ప్ర‌మాదం గురించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.. క‌ర్నాట‌క‌లోని చిత్రదుర్గ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన 13వ నెంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. టాటా నిక్సన్ కారును నడుపుతున్న సంగనబసప్ప తన కుటుంబంతో కలిసి విజయపుర నుంచి చిక్కమగళూరు వెళ్తుండగా అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ ప్రమాదంలో సంగనబసవప్ప(36), అతని భార్య రేఖ(29), ఏడేళ్ల కుమారుడు అగస్త్య, బంధువు భీమా శంకర్(7), వారి కుటుంబ స్నేహితుడు మధుసూదన్(26) అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుని మరో కుమారుడు ఆదర్శ్ (3), కుమార్తె అన్విక (5), 26 ఏళ్ల వ్యక్తి చిత్రదుర్గ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్రక్కును జాతీయ రహదారికి ఎడమవైపున నిలిపి ఉంచారు. ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ బాధ్యత వహించడు. సంగనబసప కారును ట్రక్కు వెనుక భాగంలో ఢీ కొట్టాడు. తెల్లవారు జామున 3.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చిత్రదుర్గ ఎస్పీ కె.పరశురామ తెలిపారు.

ఇదిలావుండ‌గా, 2018 నుండి 2022 వరకు ఐదేళ్లలో, క‌ర్నాట‌క వ్యాప్తంగా ప్ర‌యివేటు, ప్రభుత్వ బస్సుల వల్ల జరిగిన బస్సు ప్రమాదాల్లో మొత్తం 1,971 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో, రాష్ట్రంలో 7,675 బస్సు ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 14,847 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో బస్సు ప్రమాదాలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా రవాణా మంత్రి రామలింగారెడ్డి శాసనమండలికి ఈ వివ‌రాలు తెలియ‌జేశారు.