తమిళనాడు (tamilnadu) గవర్నర్ ఆర్ఎన్ .రవిని (rn ravi) భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం అందింది. ఈ మేరకు త్రిదండి చినజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు.. తమిళనాడు గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమై ఆహ్వాన పత్రం అందించారు. 

భగవత్‌ రామానుజాచార్యుల (chinajeeyar swamy) సహస్రాబ్ది ఉత్సవాలకు శంషాబాద్‌ (shamshabad) ముచ్చింతల్‌లో (muchintal) ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు భగవత్‌ శ్రీరామానుజాచార్యుల (ramanujacharyulu) సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, మై హోం గ్రూప్‌ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావులు ఈ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానించనున్నారు.

తాజాగా తమిళనాడు (tamilnadu) గవర్నర్ ఆర్ఎన్ .రవిని (rn ravi) భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం అందింది. ఈ మేరకు త్రిదండి చినజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు.. తమిళనాడు గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమై ఆహ్వాన పత్రం అందించారు. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోడీ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వేడుకల ముగింపు రోజైన ఫిబ్రవరి 14న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరవుతారు. వీరితో పాటు పలువురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా ఈ బృహత్తర కార్యక్రమానికి హాజరుకానున్నారు. అటు ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కోసం శరవేగంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

రామానుజాచార్య 1000వ జ‌యంతి ఉత్స‌వాలను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు చిన‌జీయర్ స్వామి ఆశ్ర‌మంలో అన్ని ఏర్పాట్లు చేశారు. దీని ఈ ఆశ్ర‌మంలో 108 దేవాల‌యాలు నిర్మించారు. అలాగే 216 అడుగుల రామానుజాచార్య విగ్ర‌హాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఉత్స‌వాల సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆశ్ర‌మానికి వ‌చ్చి రామానుజాచార్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు. 8.9వ తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న సాధుసంతువుల‌తో ‘‘ధర్మ సమ్మేళనం’’ నిర్వహిస్తారు. 

10వ తేదీన సామాజిక సామారస్యత దృష్ట్యా ‘‘సామాజిక నేతల సమ్మేళనం’’ జరనున్నాయి. బంగారంతో రూపొందించిన రామానుజ విగ్రహాన్ని భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ (president ramnadh kovind) 13వ తేదీన ఆవిష్కరించనున్నారు. 9వ తేదీన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గవత్ (rss chief mohan bhagvath), 8,9,10 తేదీలలో భయ్యాజి జోషి, భాగయ్యలు ఈ ఉత్స‌వాల్లో పాల్గొంటారు. మొత్తంగా ప్ర‌తీ రోజు వేద పండితులతో వేదోచ్చారణ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. 1035 యజ్ఞ గుండాల‌లో యజ్ఞ, యాగాదులు వంటి అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. ఈ య‌జ్ఞ యాగాదులను భ‌క్తులు సంద‌ర్శించవచ్చు. పాల్గొన‌వ‌చ్చు.