Asianet News TeluguAsianet News Telugu

అరుణాచల్‌ప్రదేశ్‌లోకి చొచ్చుకొచ్చిన చైనా: 4.5 కి.మీ. భారత భూభాగంలోకి వచ్చిన డ్రాగన్

 చైనా దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చైనా ఏకంగా భారత్ భూభాగంలోకి 4.5 కి.మీ. చొచ్చుకు వచ్చింది. ఈ ప్రాంతంలో చైనా ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది. ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

China Has Built Village In Arunachal, Show Satellite Images lns
Author
Arunachal Pradesh, First Published Jan 19, 2021, 12:21 PM IST

న్యూఢిల్లీ: చైనా దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చైనా ఏకంగా భారత్ భూభాగంలోకి 4.5 కి.మీ. చొచ్చుకు వచ్చింది. ఈ ప్రాంతంలో చైనా ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది. ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సుభాన్‌సిరి జిల్లాలోని సారి చు నది ఒడ్డున ఈ గ్రామం వెలిసింది.  ఈ ప్రాంతంపై చైనా, ఇండియా మధ్య వివాదాలున్నాయి. గతంలో ఇక్కడ యుద్దం కూడ జరిగింది.

2019 ఆగష్టులో ఉపగ్రహం తీసిన చిత్రంలో చైనా నిర్మించిన గ్రామం లేదు. 2020 నవంబర్ లో తీసిన ఫోటోలో ఈ గ్రామం ఉన్నట్టుగా కన్పించింది.గతంలో ఈ ప్రాంతంలో చైనా సైనిక శిబిరం ఉండేది. ఈ శిబిరాన్ని చైనా డెవలప్ చేసింది.  సరిహద్దు ప్రాంతంలో చైనా కొన్ని నిర్మాణాలు చేపడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని భారత ప్రభుత్వం తెలిపింది.

రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్న విషయం తమకు తెలిసిందని భారత్ తెలిపింది. సరిహద్దు ప్రాంతంలో నిర్మాణాలతో పాటు సైనిక బలగాలను భారత్ పెంచుతోందని చైనా ఆరోపించింది. దీని కారణంగానే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకొంటున్నాయని చైనా విమర్శలు చేస్తోంది.గతంలో ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీ లోక్‌సభలో ప్రస్తావించిన విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios