Asianet News TeluguAsianet News Telugu

మదర్సాలలో దైవదూషణకు శిక్షగా తల నరకమని బోధిస్తున్నారు: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌

రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ టైలర్‌ను నరికి చంపిన ఘటనపై తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ ఘటనపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను స్పందిస్తూ.. మదర్సాలలో దైవదూషణ చేసేవారి తల నరికివేయమని బోధిస్తున్నారని అన్నారు.

Children in madrasas taught punishment for blasphemy is beheading says Kerala Governor Arif Mohammad Khan
Author
First Published Jun 29, 2022, 6:25 PM IST

రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ టైలర్‌ను నరికి చంపిన ఘటనపై తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ ఘటనపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను స్పందిస్తూ.. మదర్సాలలో దైవదూషణ చేసేవారి తల నరికివేయమని బోధిస్తున్నారని అన్నారు. అమాయక పిల్లలకు ఇలాంటి బోధన చేస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న అని అన్నారు. ఇది దేవుని చట్టంగా బోధించబడుతోందన్నారు. ఇలాంటి చట్టం ఖురాన్ నుంచి రాలేదని.. చక్రవర్తుల కాలంలో కొంతమంది ఈ చట్టం చేశారని చెప్పారు. ‘‘మనం కేవలం లక్షణాలు బయటపడినప్పుము మాత్రమే చింతిస్తున్నాం. కానీ లోతైన రోగాన్ని గుర్తించలేకపోతున్నాం. దైవదూషణకు శిక్ష శిరచ్ఛేదం అని పిల్లలకు మదర్సాలలో బోధిస్తున్నారు. ఇది దేవుని చట్టంగా బోధించబడుతోంది. అక్కడ ఏమి బోధించబడుతుందో పరిశీలించబడాలి’’ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అభిప్రాయపడ్డారు. 

14 ఏళ్ల వచ్చేవరకు బ్రాడ్ బేస్డ్ ఎడ్యూకేషన్ పొందడం అనేది పిల్లల ప్రాథమిక హక్కు అని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ చెప్పారు. 14 ఏళ్లు వచ్చేవరకు పిల్లలకు స్పెషలైజ్డ్ ఎడ్యూకేషన్ ఇవ్వకూడదని అన్నారు. ఇక, గతంలో కూడా గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ మదర్సాలలో జరుగుతున్న విద్య బోధనను వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ బ్రాడ్ బేస్డ్ ఎడ్యూకేషన్ అందించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. 

ఇక, ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్‌ను దారుణంగా హత్య చేసిన ఇద్దరు వ్యక్తులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసినట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం ధృవీకరించారు. ఉద‌య్‌పూర్ హ‌త్య‌ ఉగ్ర‌వాదాన్ని వ్యాప్తి చేయ‌డానికే అని.. నిందితులకు విదేశాల‌లో సంబంధాలు ఉన్నాయ‌ని స‌మాచారం కూడా ఉందని అన్నారు. ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తుందని, రాజస్థాన్ పోలీసులకు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటిఎస్) దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరిస్తుందని ఆయన చెప్పారు. ఉదయపూర్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు హై లెవల్ మీటింగ్ నిర్వహించిన అనంతరం సీఎం అశోక్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇక, ఉదయ్‌పూర్ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈరోజు తన నివాసంలో అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా బుధవారం నగరంలోని ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించబడింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios