Asianet News TeluguAsianet News Telugu

బడ్జెట్ 2023: 'పేద, నిరుద్యోగ యువతకు ఎలాంటి ప్రయోజనం లేదు': బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి ఆగ్రహం

కేంద్ర బడ్జెట్ 2023:యూనియన్ బడ్జెట్ 2023పై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం ఆగ్రహం వ్యక్తంచేశారు.  నేటీ బడ్జెట్‌పై పేద, నిరుద్యోగ యువతకు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ఎక్కడా నిరుద్యోగం, పేదరికం, అసమానత లేదా సమానత్వం వంటి పదాలను ప్రస్తావించలేదని అన్నారు.

Chidambaram says Budget 'callous', shows how far Modi govt is removed from people, their concerns
Author
First Published Feb 2, 2023, 2:46 AM IST

బడ్జెట్‌పై పి చిదంబరం అసహనం: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం దేశ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్ అధికారికంగా స్పందించింది. ఇది ప్రజల నుంచి కోత పెట్టిన బడ్జెట్ అని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ఒక్కసారి కూడా నిరుద్యోగం, పేదరికం, అసమానతలను ప్రస్తావించలేదని,  బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు, నిరుద్యోగ యువతకు, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలిగించలేదని చిదంబరం అసహనం వ్యక్తం చేశారు.  

కొత్త పన్ను విధానాన్ని 'డిఫాల్ట్' ఎంపికగా మార్చడం అన్యాయమని మాజీ ఆర్థిక మంత్రి అన్నారు. పాత పన్ను విధానంలో సాధారణ పన్ను చెల్లింపుదారుడు పొందే నిరాడంబరమైన సామాజిక భద్రతకు గాయమని, ఇది అర్ధంలేని బడ్జెట్ అని, ఇది చాలా మంది ప్రజల అంచనాలను దెబ్బతీసిందని ఆయన అన్నారు.

పేద, ధనిక తారతమ్యం లేదు

కేంద్ర ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ఎక్కడా కూడా నిరుద్యోగం, పేదరికం, అసమానత, సమానత్వం వంటి పదాలను ప్రస్తావించలేదని, ప్రజల జీవనోపాధి, ఇతర ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోలేదని , ధనవంతులు,పేదలలో పెరుగుతున్న అసమానతలను పట్టించుకోరని అన్నారు. ఈ బడ్జెట్‌ వల్ల ఎవరికి లబ్ధి చేకూరిందని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. పేదలు,నిరుద్యోగ యువత, పన్ను చెల్లింపుదారు, గృహిణీలకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని తెలిపారు. 

అదే సమయంలో బడ్జెట్ గురించి కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక సమస్యలను బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు. నిరుద్యోగం, పేదరికం వంటి పదాలు కూడా ప్రస్తావించలేదు. పేద అనే పదాన్ని రెండుసార్లు మాత్రమే ఉపయోగించారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రతి త్రైమాసికంలో వృద్ధి రేటు తగ్గుముఖం పట్టిందని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios