కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతుండడంతో
రాయ్ పూర్ జిల్లాలో ఈ నెల 9వ తేదీ నుండి పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ప్రకటించింది.
రాయ్‌పూర్: కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతుండడంతో రాయ్ పూర్ జిల్లాలో ఈ నెల 9వ తేదీ నుండి పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నెల 9 నుండి 19వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతోందని ప్రకటించింది. ఈ మేరకు రాయ్‌పూర్ కలెక్టర్ ఎస్. భారతీ దర్శన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ తో పాటు కంటైన్మెంట్ జోన్లలు, రిస్టిక్టెడ్ ప్రాంతాల్లో ఈ నెల 9వ తేదీ నుండి రాత్రి 9 గంటల నుండి లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా ప్రకటించారు.
కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నందున కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఈ చర్యలు తీసుకొన్నట్టుగా ఆ ఉత్తర్వుల్లో కలెక్టర్ తెలిపారు. లాక్ డౌన్ సమయంలో రాయ్ పూర్ జిల్లా సరిహద్దులను పూర్తిగా మూసివేయనున్నట్టుగా కలెక్టర్ తెలిపారు.వ్యాపార సముదాయాలతో పాటు లిక్కర్ దుకాణాలను కూడ మూసివేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మెడికల్ దుకాణాలు మినహాయించి అన్ని షాపులు మూసివేస్తామన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ కార్యాలయాలను కూడ మూసివేస్తామన్నారు. ఆసుపత్రులు, ఏటీఎంలు తెరిచే ఉంటాయని కలెక్టర్ తెలిపారు. పాలు, న్యూస్ పేపర్లకు ఉదయం ఆరు గంటల నుండి 8 గంటల వరకు అనుమతి ఇస్తామని తెలిపారు.పారిశ్రామిక యూనిట్లు నిర్మాణ యూనిట్లు ఆయా ప్రాంగణంలో వసతి కల్పించి పనులు నిర్వహంచేందుకు అనుమతి ఇచ్చినట్టుగా కలెక్టర్ తెలిపారు.
Last Updated Apr 8, 2021, 10:47 AM IST