Asianet News TeluguAsianet News Telugu

'పసివాళ్లనే కనికరం లేకుండా నేలకేసి కొట్టి.. అంతటితో ఆగకుండా.. ' :  అడాప్షన్ సెంటర్‌లో మహిళ దాష్టికం

ఓ అడాప్షన్ సెంటర్‌ లో జంతువులు సైతం సిగ్గు పడేలా మహిళా ఉద్యోగి  దారుణంగా ప్రవర్తించింది. పసివాళ్లనే కనీసం కనికరం లేకుండా ఇద్దరు చిన్నారులను అత్యంత దారుణంగా కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆమె పై చర్యలు తీసుకున్నారు. 

Chhattisgarh woman arrested for thrashing girls at adoption centre krj
Author
First Published Jun 6, 2023, 6:00 AM IST

తల్లిదండ్రులు లేక, ఆదరించే వారు లేక కొందరు చిన్నారులు అనాధలు అవుతున్నారు. అలాంటి వారిని కొన్ని స్వచ్ఛంధ సంస్థలు, అనాధ ఆశ్రమాలు అదుకుంటున్నాయి. వారికి అన్నీ తానై చూసుకుంటాయి. కానీ,అడాప్షన్ సెంటర్‌లో పనిచేసే  మహిళా ఉద్యోగి చిన్నారుల పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఆ చిన్నారుల కష్టాలు చూస్తుంటే..  గుండె తరుక్కుపోతుంది. ఆ మహిళ  నిండా ఆరేళ్లు కూడా లేని పసి పిల్లల పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించింది. ఇదంతా సిసిటీవీ కెమెరాలో రికార్డు కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలు చూస్తే.. పిల్లల పట్ల క్రూరంగా వ్యవహరించిన ఆ మహిళను అక్కడిక్కడే ఉరి తియ్యాలనే పిలుస్తోంది.  
 
వివరాల్లో కెళ్లే.. చత్తీస్ గడ్ లోని కాంకేర్ జిల్లాలోని ఓ ఆనాధశ్రయంలో తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే.. అందులో సీమా ద్వివేది అనే మహిళ ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేస్తుంది. ఆ మహిళ ఉద్యోగి ఇద్దరు చిన్నారులను క్రూరంగా కొడుతూ.. పాశవికంగా హింసించింది. గుక్కపట్టి ఏడుస్తున్నా కనికరం చూపకుండా.. ఆ చిన్నారులను జుట్టు పట్టుకుని చితక్కొట్టింది. అంతటితో ఆగకుండా.. ఆ బాలికలను నేలకేసి.. బాదింది. మంచంపై విసిరివేసింది. ఆనాధ పిల్లలు అనే ఇంగితం కూడా లేకుండా  విచక్షణరహితంగా వారిపై దాడి చేసింది. ఈ 
దారుణమంతా  అక్కడ ఉన్న సిసి కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వైరల్ వీడియోను చూసిన వారంతా ఆ మహిళ ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆమెను అరెస్ట్ చెయ్యండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


ఆ వీడియో జిల్లా యంత్రాంగ ద్రుష్టికి వెళ్లడంతో ఆ మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే ఆ ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీడియోలో కనిపించిన మహిళను ప్రతిజ్ఞ వికాస్ సంస్థ నిర్వహిస్తున్న 'స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ' సూపరింటెండెంట్ సీమా ద్వివేదిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆమె పై జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015లోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. కలెక్టర్‌కు సమర్పించిన నివేదికలో కాంకేర్‌లో ఫిర్యాదు పిల్లలపై దాడి సరైనదని, సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నప్పుడు తెలిపారు. నిందితురాలిపై జువైనల్ జస్టిస్ యాక్ట్  2015లోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్య ఉమేష్ మిశ్రా అభ్యర్థించారు.


తప్పును అంగీకరించిన ఉద్యోగి

నివేదిక ప్రకారం.. తనిఖీ సందర్భంగా ద్వివేది వీడియో అదే సెంటర్‌కు చెందినదని, ఇది సుమారు సంవత్సరం క్రితం అని అంగీకరించారు. తన మానసిక పరిస్థితి సరిగ్గా లేనందునే కేంద్రంలోని ఇద్దరు విద్యార్థినులను కొట్టినట్లు ద్వివేది తన ప్రకటనలో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ఆడపిల్లకు ఎన్నిసార్లు హెచ్చరించినా అంగన్‌వాడీ కేంద్రం నుంచి తిరిగి వచ్చే సమయంలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి చాక్లెట్లు తీసుకునేవారని, తన చర్యకు తాను క్షమాపణలు కోరింది, అప్పటి నుంచి ఇలాంటి ఘటన పునరావృతం కాలేదని ద్వివేద్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios