Korba road accident: ఛ‌త్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ  రోడ్డు ప్ర‌మాదంలో ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందార‌ని పోలీసు వ‌ర్గాలు తెలిపాయి.  

Chhattisgarh road accident: ఛ‌త్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్డు ప్ర‌మాదంలో ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందార‌ని పోలీసు వ‌ర్గాలు తెలిపాయి. కేసు న‌మోదుచేసుకుని విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని పేర్కొన్నాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. ఛత్తీస్ గఢ్ లోని కోర్బా జిల్లాలో బుధవారం ఉదయం ఓ మహిళ, ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు. మోర్గా పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్ పూర్ ఫారెస్ట్ బారియర్ వద్ద ట్రక్కు, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో అంబికాపూర్ కు చెందిన మనోజ్ కుమార్ టిర్కే అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి అంబికాపూర్ నుంచి జగదల్ పూర్ కు ప్రయాణిస్తున్నాడని మోర్గా పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి అశ్వని నిరంకారీ తెలిపారు.

మృతుడి కుటుంబ సభ్యుల్లో ఓ వ్యక్తి, అతని భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత ట్రక్కు డ్రైవర్ అక్క‌డి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. రెండు వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.