రాయ్‌పూర్: రాఖీ పౌర్ణమి రోజున సోదరి కోరిక మన్నించి ఓ మావోయిస్టు జన జీవన స్రవంతిలో చేరాడు. 14 ఏళ్ల తర్వాత సోదరి కోరిక మేరకు ఆయన తిరిగి ఇంటికి చేరుకొన్నాడు. ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.రాఖీ పండుగ అంటే  సోదరి, సోదరుల మధ్య అనుబంధానికి ప్రతీకగా చెబుతారు. రక్షాభందన్ గొప్పతనాన్ని నిజం చేసే  సంఘటన చోటు చేసుకొంది. 

ఛత్తీస్‌ఘడ్ లోని దంతేవాడ జిల్లా పల్నార్ గ్రామానికి చెందిన మల్లా అనే వ్యక్తి తన 12 ఏళ్ల వయస్సులో ఇంటి నుండి వెళ్లిపోయి మావోయిస్టుల్లో చేరాడు.14 ఏళ్లుగా మల్లా ఇంటికి తిరిగి రాలేదు. అతని చెల్లెలు లింగేతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. 

తన సోదరుడు మల్లాను ఇంటికి రప్పించాలని సోదరి లింగే భావించింది. అయితే అదే సమయంలో 2016 లో ప్లాటూన్ డిప్యూటీ కమాండర్ గా  ఎదిగాడు. ఆ తర్వాత బైరవ్‌ఘడ్ ఏరియా కమిటీ నకన్సలైట్ కమాండర్ గా  పనిచేస్తున్న మల్లా తలపై పోలీసులు రూ. 8 లక్షల రివార్డును ప్రకటించింది. 

దీంతో మావోయిస్టు ఉద్యమం నుండి తన సోదరుడు మల్లాను తీసుకు రావాలని లింగే భావించింది. మావోయిస్టు ఉద్యమంలో ఉంటే తన సోదరుడు జీవించలేదని ఆమె నిర్ణయం తీసుకొంది. 

లింగే రక్షాబంధన్ ను సోదరుడు మల్లాను కలిసింది. రాఖీ కట్టి పోలీసులకు లొంగిపోవాలని కోరింది.  ఎన్నో ఏళ్ల తర్వాత సోదరిని కలుసుకున్న లింగే ఆమె కట్టిన రాఖీకి విలువ ఇచ్చాడు.  నక్సలిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించాడు. దాంతో మల్లాకు పునరావాసం కల్పిస్తామని దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు.