ఛత్తీస్ గడ్: ఛత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు, ఇద్దరు డీఆర్జీ జవాన్లు మృతి చెందారు. 

సుక్మా జిల్లా ఎల్మాగడా, గొండరాజ్ పాడ్ అటవీ ప్రాంతంలో జవాన్లకు మావోయిస్టులు తారుసపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువురు కాల్పులు జరిపారు. దీంతో పది మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో భారీగా ఆయుధాలు, ఐఈడీలు స్వాధీనం చేసుకున్నారు.