Asianet News TeluguAsianet News Telugu

ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన చివరి విడత పోలింగ్.. లక్షమందితో భద్రత

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ చివరి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 72 నియోజకవర్గాలకు గానూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

chhattisgarh elections 2018: second face polling starts today
Author
Chhattisgarh, First Published Nov 20, 2018, 9:06 AM IST

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ చివరి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 72 నియోజకవర్గాలకు గానూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది.

మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునివ్వడంతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. రాష్ట్ర, కేంద్ర పోలీసులతో పాటు సైన్యంతో కలిపి మొత్తం లక్షమందిని బందోబస్తుకు వినియోగిస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు.

ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పోటీలో నిలిచారు. శాసనసభ స్పీకర్, తొమ్మిది మంది మంత్రులు, ఛత్తీస్‌గఢ్ పీసీసీ అధ్యక్షుడు తదితరుల భవితవ్యం నేడు ఈవీఎంలో నిక్షిప్తం కానుంది. మావోల కంచుకోటలుగా పేరొందిన 18 నియోజకవర్గాల్లో ఈ నెల 12న తొలిదశ పోలింగ్ జరిగింది. వచ్చే నెల 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios