ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ లో రైతులను పరామర్శించేందుకు వచ్చిన ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ ను లక్నో ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో ఆయన ఎయిర్ పోర్టులోనే బైఠాయించి నిరసనకు దిగారు.

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ లో రైతులను పరామర్శించేందుకు వచ్చిన ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ భగేల్ ను లక్నో ఎయిర్‌పోర్ట్‌లోనే పోలీసులు నిలిపివేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. లఖీంపూర్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన ఎయిర్ పోర్టు లాంజ్‌లోనే బైఠాయించి నిరసనకు దిగారు.

also read:Priyanka Gandhi Arrest : ఆమె ‘నిర్భయ’.. ‘అసలైన కాంగ్రెస్ వాది’... రాహుల్ గాంధీ ట్వీట్...

ఇదిలా ఉంటే Lakhimpur రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని పోలీసులు సోమవారం నాడు అదుపులోకి తీసుకొన్నారు. సీతాపూర్ గెస్ట్ హౌస్ లోనే ఆమెను 35 గంటలుగా నిర్భంధించారు. 144 సెక్షన్ ను ఉల్లంఘించినందుకు గాను అరెస్ట్ చేసినట్టుగా యూపీ పోలీసులు మంగళవారం నాడు ప్రకటించారు. సీతాపూర్ గెస్ట్ హౌస్ లోనే ప్రియాంకగాంధీని పోలీసులు ఉంచారు.

లఖీంపూర్ ఘటనపై ఇవాళ లక్నోలో Bhupesh Baghel మీడియా సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత లఖీంపూర్ లో రైతు కుటుంబాలను పరామర్శించాల్సి ఉంది. లక్నో ఎయిర్‌పోర్టులోనే ఆయనను పోలీసులు అడ్డుకొన్నారు.

లఖీంపూర్ లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు నడుపుతున్న కారు రైతులను ఢీకొట్టిన ఘటనలో 8 మంది రైతులు మరణించారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయ.ఈ ఘటనను నిరసిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.

ఈ ఆందోళనలకు విపక్షాలు మద్దతు ప్రకటించాయి. లఖీంపూర్ వెళ్లేందుకు ప్రయత్నంచిన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకొన్నారు.