Raipur: నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి బుపేష్ బఘేల్ నాయకత్వంలోని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్న 18-35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ యువతకు నెలకు రూ.2,500 భృతి ఇస్తామని సీఎం తెలిపారు.
Chhattisgarh budget: ఛత్తీస్‌గఢ్ బడ్జెట్-2023ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుటుంబ వార్షిక ఆదాయం రూ .2.5 లక్షల లోపు ఉన్న 18-35 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ .2,500 భృతిని అందిస్తుందని ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తల నెలవారీ గౌరవ వేతనాన్ని ₹ 6,500 నుంచి ₹ 10,000కి పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 1న ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు బఘేల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి రాష్ట్ర బడ్జెట్ ఇదే. దీంతో బడ్జెట్ పై ఆసక్తి నెలకొంది. నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వడం, అంగన్‌వాడీ కార్యకర్తల నెలవారీ గౌరవ వేతనాన్ని ₹ 6,500 నుంచి ₹ 10,000కి పెంచుతున్నట్లు ప్రకటించడం రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపనుందని తెలుస్తోంది.
భూపేష్ బఘేల్ ఆదివారం నాడు ఒక వీడియో ప్రకటనలో ‘‘మన రాష్ట్రం దేశానికి దారి చూపుతోంది. ప్రజల అవగాహన మారింది. నేను సోమవారం సమర్పించబోతున్న బడ్జెట్ మన రాష్ట్ర కలలకు కొత్త వాస్తవికతను ఇస్తుంది, ఇది ఆకాశంలో గాలి మేడల నిర్మాణం కాకుండా నేలపై మాట్లాడుతుంది” అని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఎదురైన ఇబ్బందులు తెలుసని బఘేల్ అన్నారు. "... గ్లోబల్ కోవిడ్ మహమ్మారి అయినా, ఇతర సవాళ్లు అయినా రాష్ట్ర ప్రజలకు తాము ఎదుర్కొన్న సమస్యల గురించి తెలుసు. కానీ అన్ని సవాళ్లను అధిగమించామని, ఆర్థిక నిర్వహణలో మనది అత్యుత్తమ రాష్ట్రాలలో ఒకటని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను" అని ఆయన అన్నారు.
