రాయచూర్: ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బలరాంపూర్ జిల్లాలో వాహనం బోల్తా కొట్టడంతో 8 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. 

పికప్ వ్యాన్ శుక్రవారం అర్థరాత్రి బోల్తా కొట్టడం అమేరా గ్రామంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు అదనపు పోలీసు సూపరింటిండెంట్ సుర్గుజా చెప్పారు. 

డ్రైవర్ మద్యం సేవించినట్లు ప్రయాణికులు చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తున్నట్లు ఆయన తెలిపారు.