Asianet News TeluguAsianet News Telugu

ఛత్రపతి శివాజీ కర్ణాటక వాడే.. డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు...

కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్‌ కార్జోల్‌ ఛత్రపతి శివాజీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.  చాలా రోజులుగా మహారాష్ట్ర, కర్ణాటక అధికార పార్టీ నేతల మధ్య సరిహద్దు సమస్యపై మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

Chhatrapati Shivaji Maharaj was a kannadiga claims karnataka deputy CM govind karjol - bsb
Author
Hyderabad, First Published Feb 1, 2021, 4:42 PM IST

కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్‌ కార్జోల్‌ ఛత్రపతి శివాజీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.  చాలా రోజులుగా మహారాష్ట్ర, కర్ణాటక అధికార పార్టీ నేతల మధ్య సరిహద్దు సమస్యపై మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

ముందుగా బెల్గావ్, కార్వార్‌ కర్నాటకలోనివి కావని, అవి మహారాష్ట్రవని సీఎం ఉద్దవ్ ఠాక్రే  వ్యాఖ్యానించడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. దీనికి కౌంటర్ గా దేశ ఆర్థిక రాజధాని ముంబై కర్ణాటకది అంటూ ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ వివాదాన్ని మరింత పెంచారు. 

వీరిద్దరి వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్సీపీ నేతలు రంగంలోకి దిగి లక్ష్మణ్ పై విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేవరకు కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కేంద్ర భూభాగంగా ప్రకటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవల డిమాండ్‌ చేశారు. దీంతో కర్ణాటక ఉపముఖ్యమంత్రులిద్దరు ఆదివారం మహారాష్ట్ర  మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే విరుచుకుపడ్డారు. 

వారొక అడుగు ముందుకేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ ‘కన్నడిగ’ అని డిప్యూడీ సీఎం గోవింద్ ఆరోపించారు. ఉద్ధవ్‌ ఠాక్రేకు చరిత్ర తెలియదని, శివాజీ పూర్వీకుడు బెల్లియప్ప కర్ణాటకలోని గడగ్‌ జిల్లా సోరటూర్‌కు చెందినవాడని పేర్కొన్నారు. గడగ్ లో కరువు వచ్చినప్పుడు బెల్లియప్ప మహారాష్ట్రకు బయలుదేరాడని డిప్యూటీ సీఎం తెలిపారు. 

శివసేన గుర్తుగా, పార్టీ పేరుగా పెట్టుకున్నది ఓ కన్నడ వ్యక్తి శివాజీదని, శివాజీ నాల్గవ తరానికి చెందిన వ్యక్తి అని గోవింద్‌ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఉద్ధవ్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో గొడవలపై ప్రజల దృష్టిని మళ్లించడానికి బెల్గావ్ సమస్యను లేవనెత్తాడని కార్డోల్ ఆరోపణలు గుప్పించారు. 

మహారాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాల్లో విఫలమైందని ఉద్ధవ్‌  ప్రజాధరణ కోల్పోతున్నాడని మరో డిప్యూటీ సీఎం లక్ష్మణ్ ఆరోపించారు. ముంబైని కర్ణాటకలో భాగం చేయాలని లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేవారు. 

స్వేచ్ఛ కోసం కిట్టూర్ రాణి చెన్నమ్మ బ్రిటిష్ వారిపై సాయుధ తిరుగుతబాటుకు దారి తీసిన భూమి బెల్గావి అని, బెలగావి జిల్లాకు చెందిన మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శశికళ జోల్లె వ్యాఖ్యానించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios