Asianet News TeluguAsianet News Telugu

ఎఫైర్ పెట్టుకుందని అనుమానం.. భార్యను చంపి 5 ముక్కలుగా నరికిన భర్త.. నకిలీ నోట్ల కోసం వెళితే ఘటన వెలుగులోకి

ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నదనే అనుమానంతో గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత బాడీని ఐదు ముక్కలుగా నరికి కొత్తగా కొనుగోలు చేసిన వాటర్ ట్యాంక్‌లో దాచి పెట్టాడు. అతను నకిలీ కరెన్సీ ముద్రిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు తనిఖీ చేయగా.. భార్య హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
 

chhatisgarh man kills wife and chops her body into 5 pieces, prints counterfeit currency
Author
First Published Mar 7, 2023, 4:50 PM IST

రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నదనే అనుమానంతో భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఐదు ముక్కులుగా నరికేశాడు. ఇంటిలోని ఓ వాటర్ ట్యాంక్‌లో ఆ ముక్కలను ఉంచాడు. నిందితుడు నకిలీ నోట్లు ముద్రిస్తున్నాడనే విషయం తెలిసి పోలీసులు అతడి ఇంట్లో రైడ్ చేయగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ నిందితుడిపై మర్డర్ కేసుతోపాటు నకిలీ నోట్ల ప్రింటింగ్‌ ఆరోపణలతోనూ కేసు నమోదైంది. ఈ ఘటన బిలాస్‌పూర్ జిల్లాలో జరిగింది.

బిహార్ ఎస్పీ సంతోష్ సింగ్ పీటీఐతో మాట్లాడుతూ, బిలాస్‌పూర్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి 23 ఏళ్ల తన భార్య సతి సాహు వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అనుమానించాడు. జనవరి 6వ తేదీన ఆమెను గొంతు నులిమి చంపేశాడు. 

ఆ వ్యక్తి నకిలీ నోట్లను కూడా ముద్రిస్తున్నట్టు సమాచారం యాంటీ క్రైమ్, సైబర్ యూనిట్ పోలీసులకు తెలిసింది. వారు అతని ఇంటిలో తనిఖీలు చేశారు. బాత్‌రూమ్‌కు దగ్గరలోని గదిలో నుంచి దుర్వాసన రావడం గమనించి అది ఓపెన్ చేశారు. అందులో ఖాళీ వాటర్ ట్యాంక్‌ కనిపించింది. అందులో టేప్, పాలిథీన్ కవర్లతో ప్యాక్ చేసిన డెడ్ బాడీ పార్టులు కనిపించాయి.

ఆ వ్యక్తిని ఇంటి వద్దనే పట్టుకున్న పోలీసులు అతని వద్ద నుంచి నకిలీ నోట్లనూ స్వాధీనం చేసుకున్నారు. కలర్ ప్రింటర్, ఫొటోకాపీడ్ పేపర్లు, రూ. 500, రూ. 200 డినామినేషన్ల నకిలీ నోట్లను రికవరీ చేసుకున్నారు. 

Also Read: రాహుల్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను సమర్థిస్తారా ? - సోనియా గాంధీ, ఖర్గేలకు బీజేపీ సూటి ప్రశ్న..

తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అనుమానిస్తున్నట్టు ఆ వ్యక్తి ఇంటరాగేషన్‌లో పోలీసులకు తెలిపాడు. అంతేకాదు.. తన నకిలీ నోట్ల ముద్రణ పనిలోనూ జోక్యం చేసుకుందని వివరించాడు.

సతి సాహను చంపేసిన తర్వాత ఓ వాటర్ ట్యాంక్‌ను, కట్టర్ మెషీన్‌ ను కొనుగోలు చేసినట్టు నిందితుడు దర్యాప్తులో తెలిపాడని ఎస్పీ సంతోష్ సింగ్ వివరించారు. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని ముక్కలుగా నరికేశాడని, వాటికి నిప్పు పెట్టాలని భావించాడని తెలిపారు. కానీ, పొగ ద్వారా వాసన వస్తుందని భావించి, ఆ భాగాలను వాటర్ ట్యాంక్‌లో దాచి పెట్టినట్టు పేర్కొన్నాడని వివరించారు.

వారిద్దరూ పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారని పోలీసులు తెలిపారు. మర్డర్, నకిలీ కరెన్సీ ప్రింటింగ్ ఆరోపణలతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios