Ram Mandir Trust: అయోధ్య‌లోని రామమందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా భక్తులు విరాళాలు అందించినప్పటికీ, ఆలయ ట్రస్టుకు వచ్చిన రూ.22 కోట్లకు పైగా విలువైన 15,000 చెక్కులు బౌన్స్ అయినట్లు అధికారులు తెలిపారు.

Ram Mandir Trust: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 'నిధి సమర్పణ్ యోజన' కింద విరాళాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్ట్ ఇటీవ‌ల నిర్వ‌హించిన ఆడిట్‌లో షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఇప్ప‌టికీ వ‌ర‌కూ సేక‌రించిన 22 కోట్ల విలువైన 15,000 చెక్కులు బౌన్స్ అయ్యాయని విశ్వహిందూ పరిషత్ జిల్లా యూనిట్లు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం రామమందిరం ట్రస్టుకు ఇప్పటి వరకు రూ.3400 కోట్లు విరాళంగా అందాయి.

అదే నివేదిక విరాళంగా ఇచ్చిన డబ్బుకు సంబంధించిన బ్యాంక్ చెక్కుల బౌన్స్ గురించి కూడా సమాచారం ఇచ్చింది కానీ వాటి కారణాల గురించి ప్రస్తావించలేదు. ఏయే చెక్కులు బౌన్స్ అయ్యాయో, తిరస్కరణకు గురయ్యాయని ట్రస్ట్ స‌భ్యుడు డాక్ట‌ర్ అనిల్ మిశ్రా తెలిపారు.

స్పెల్లింగ్ మిస్టేక్ లేదా సంతకం సరిపోలడం లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల చాలా చెక్కులు బౌన్స్ అయ్యాయని, చిన్న తప్పుల కారణంగా బౌన్స్ అయిన చెక్కులను తిరిగి బ్యాంకుకు అందజేస్తామని ఆయన చెప్పారు. అయోధ్యలో నివసిస్తున్న దాతల చెక్కులు అత్యధిక సార్లు బౌన్స్ అయ్యాయని నివేదికలో పేర్కొంది. ఒక్క అయోధ్య జిల్లాలోనే రెండు వేలకు పైగా చెక్కులు బౌన్స్ అయ్యాయి.

రామ మందిర నిర్మాణానికి లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు విరాళం ఇచ్చిన వారి సంఖ్య 31663 అని గుప్తా తెలిపారు. అదేవిధంగా.. ఐదు నుంచి 10 లక్షల రూపాయల వరకు విరాళాలు అందించిన వారి సంఖ్య 1428 మంది . ఇది కాకుండా 950 మంది 10 నుంచి 25 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. అదే సమయంలో, 25 నుండి 50 లక్షల రూపాయల వరకు విరాళం ఇచ్చిన వారు 123 మంది ఉన్నారు. అలాగే.. 127 మంది 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు విరాళం అందించారు. అలాగే కోటి రూపాయలకు పైగా విరాళాలు ఇచ్చిన వారు 74 మంది ఉన్నారు. విశ్వహిందూ పరిషత్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు ఇప్పటివరకు రూ. 3,400 కోట్లు విరాళంగా అందాయి.