Online Rummy: తమిళనాడులోని చెన్నైలో మరో వివాహిత ఆన్ లైన్ రమ్మీ గేమ్ బానిసై.. త‌న ప్రాణాల‌ను బలితీసుకుంది. భవాని అనే వివాహిత గేమ్ పిచ్చితో త‌న బంగారాన్ని తాక‌ట్టు పెట్టి.. అప్పులు చేసింది. ఆ అప్పులు తీర్చ‌లేక చివ‌రికి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది

Online Rummy: ఆన్‌లైన్‌ రమ్మీ (Online Rummy) ఈ గేమ్ కు చట్టప‌ర‌మైన నిషేధం ఉన్న‌ పెద్ద సంఖ్యలో నెటిజ‌న్లు.. అందులో ముఖ్యంగా యువత ఆకర్షితులవుతున్నారు. ఈ ఆన్‌లైన్‌(Online)గేమ్ ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించవ‌చ్చ‌నే దురాలోచనతో లక్షల‌ రూపాయలను చేజార్చుకుంటున్నారు. ఈ గేమ్ కు బానిసై.. ఈ భారీ మొత్తంలో అప్పులు చేస్తున్నారు. చివ‌రికి చేసినా అప్పులు తీర్చలేక చావు తప్ప వేరే దారి లేదని భావిస్తున్నారు. 

ఈ రమ్మీగేమ్ లో మొదట కస్టమర్లకు కొంత డబ్బులు వాచ్చేలా రూపొందిస్తారు. అలా డ‌బ్బుతో మురిపిస్తారు. అలాగే ఆట కొన‌సాగితే.. అప్పుడూ అస‌లు ఆట చూపిస్తారు. డబ్బులు వస్తున్నాయి కదా అని సరదాగా.. ప్రారంభించిన ఆట ఇక‌ వ్యసనంగా మారుతుంది. చేతిలో ఉన్న డబ్బులు పోయి.. అప్పులు చేస్తుంది. ఒక్కసారి అలవాటు పడితే చాలు దానికి బానిసల్ని చేస్తుంది. చేతిలో డబ్బులే కాదు చివరకు అప్పులు చేసి.. ఆ అప్పులు తీర్చ‌లేని ప‌రిస్థితిలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డేలా చేస్తుంది. తాజాగా.. ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసైన ఓ వివాహిత తన భర్త‌కు తెలియ‌కుండా 20 సవర్ల బంగారాన్ని తాకట్టు పెట్టి మరి రమ్మీ ఆడింది. అప్పుల పాలై.. చివ‌రికి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘ‌ట‌న త‌మిళ‌నాడు లోని చైన్నైలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకెళ్తే.. చెన్నై తిరువొత్తియూరు మనలి పుదునగర్‌ చెందిన భాగ్యరాజ్, భవానిల‌కు ఆరేళ్ల క్రితం ప్రేమ‌వివాహం చేసుకున్నారు. వారికి మెగ్రటిక్‌ (3), నోబల్‌ గ్రిస్‌(01) అనే పిల్లలున్నారు. భాగ్యరాజ్ కందన్‌ చావడిలోని ఓ హెల్త్‌ కేర్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇలా సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి ఆన్ లైన్ ర‌మ్మీ గేమ్ ఎంట‌ర్ అయ్యింది. గ‌త ఏడాది కాలంగా భవాని ఆన్‌లైన్‌ రమ్మీకి ఆకర్షితురాలైంది. ఈ క్ర‌మంలో త‌న‌ భర్తకు తెలియకుండా.. ఇంట్లో ఉన్న నగదును, బ్యాంక్‌లో జమ చేసిన డబ్బును Online Rummy గేమ్‌లో పెట్టి.. మునిగింది.

అంత‌టితో ఆగిపోకుండా.. త‌న‌ ఇంట్లో ఉన్న 20 సవర్ల నగలను తాక‌ట్టు పెట్టి మ‌రీ గేమ్‌ ఆడింది. ఆ డ‌బ్బును కూడా కోల్పోయింది. చివరకు తన చెల్లెలు వద్ద నుంచి దాదాపు రూ.3 లక్షల వ‌ర‌కు అత్యవసరం పేరిట డబ్బు తీసుకుని..అన్ లైన్ రమ్మీలో పెట్టింది. ఈ వ్యవహారం భ‌ర్త‌ భాగ్యరాజ్‌ దృష్టికి వెళ్లింది. ఈ క్ర‌మంలో ఆయ‌న ప‌లు సార్లు ఆమెను మందలించినా ఫలితం మాత్రం శూన్యం. 

రెండు రోజుల కిత్రం తన సోదరికి ఫోన్‌ చేసి... కొందరి వద్ద తాను అప్పలు చేసినట్టుగా భవాని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి తన గదిలో భవాని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారంతో పోలీసు లు రంగంలోకి దిగి విచారించారు. ఆమె బ్యాంక్‌ ఖాతా నుంచి ఏడాది కాలంలో రూ. 20 లక్షల మేర కు నగదు జమ కావడం, ఆ మొత్తం ఆన్‌లైన్‌ రమ్మీ Online Rummy కి వాడి ఉండటం వెలుగు చూసింది.