తమిళనాడు రాష్ట్రంలోని అనాధ బాలికల ఆశ్రమంలో నిర్వాహకులు లైంగికదాడికి పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. ఈ ఆశ్రమాన్ని సోమవారంనాడు  జడ్జి తనిఖీ చేయడంతో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి.  


చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని అనాధ బాలికల ఆశ్రమంలో నిర్వాహకులు లైంగికదాడికి పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. ఈ ఆశ్రమాన్ని సోమవారంనాడు తనిఖీ చేసిన జడ్జికి దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. దీంతో 44 మంది బాలికలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని సరస్వతి నగర్‌లో ఈ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో 5 నుండి 14 ఏళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. సోమవారం నాడు ఈ ఆశ్రమాన్ని జడ్జిలు తనిఖీ చేశారు.

జడ్జి తనిఖీతో బాలికపై లైంగిక దాడుల విషయం వెలుగు చూసింది. తమపై లైంగిక దాడికి సంబంధించి బాలికలు దారుణమైన విషయాలను బాలికలు బయటపెట్టారు. దీంతో పోలీసులు ఈ ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించారు.ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.